Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
కేంద్ర ప్రభుత్వం అంతర్గత ఎమర్జెన్సీని నడుపుతుందని అందులో భాగంగానే అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని,అక్రమ అరెస్టులను ప్రతిఒక్కరూ ఖండించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి కోరారు.ఈ నెల 12 న రాష్ట్రంలో మోడీ పర్యటన నేపథ్యంలో ముందస్తుగా పోలీసులు సీపీఐ(ఎం)నాయకుల అక్రమ అరెస్టును నిరసిస్తూ గురువారం స్థానిక టౌన్ పోలీసుస్టేషన్లో నిర్వహించిన నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు.లౌఖిక భారతదేశంలో మతాల మధ్య చిచ్చు రేపుతూ బీజేపీ పబ్బం గడుపుకుంటుందన్నారు. దేశంలో 2020 లో సీఏఏ, ఎన్ఆర్సీ లాంటి పౌరసత్వ చట్టాలను ముందుకు తీసుకొచ్చి ప్రజల నుండి తిరుగుబాటు రాగానే వెనక్కు తీసుకుని మళ్లీ దేశంలో ఉపఎన్నికలు అయిపోగానే పౌరసత్వ చట్టాన్ని తిరగదోడడం ఆ పార్టీకి అలవాటుగా మారిందన్నారు.గతేడాది రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభమై వేల కోట్ల టన్నుల ఎరువులు ఉత్పత్తి చేస్తుందన్నారు.అంతే కాకుండా 87 కోట్ల రూపాయల లాభం ఆ ఫ్యాక్టరీకి వచ్చాయని, మళ్లీ ఆ ఫ్యాక్టరీని ఈనెల 12వ తేదీన ప్రారంభిస్తుండడం విడ్డూరంగా ఉందన్నారు.కేంద్ర ప్రభుత్వం ప్రజలకు నష్టం కలిగించే విధంగా ధరల పెరుగుదల ,ఆర్థిక కుంభకోణాలు చేస్తూ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుందన్నారు.కొట్లాడి సాధించుకున్న కార్మిక హక్కులకు రద్దు చేసి దేశంలో ఉత్పత్తిరంగాన్ని దెబ్బ తీసిందన్నారు.అదేవిధంగా వ్యవసాయరంగంలో నల్లచట్టాలను తీసుకొచ్చి రైతుల ఆత్మహత్యలకు కారణంగా ఉందని ఆయన విమర్శించారు.బీజేపీ కపటనీతి కుయుక్తులను ఈదేశంలో సీపీఐ(ఎం) సాగనివ్వదన్నారు.ఈ కార్యక్రమంలో ఎలుగూరి గోవిందు, కొలిశెట్టి యాదగిరిరావు, చిన్నపంగి నర్సయ్య, వీరబోయిన రవి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.