Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట కలెక్టరేట్
జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీ, విద్యార్థుల ఫీజురీయీంబర్స్మెంట్ రెండేండ్లుగా పెండింగ్ బకాయిలు ఇవ్వాలని, వెంటనే విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు వీరబోయిన లింగయ్య అన్నారు.జాతీయ అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణయ్య తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్, ఆర్డీఓ, తహసీల్దార్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు.అందులో భాగంగా గురువారం బీసీ విద్యార్థి సంఘం సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 60ఫీట్ల రోడ్డు నుండి వందలాదిగా విద్యార్థులు ర్యాలీగా వెళ్లి సూర్యాపేట ఆర్డీవో ఆఫీస్ ముట్టడి ధర్నా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సంఘం నాయకుడు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ,ముస్లిం, మైనార్టీ విద్యార్థులకు,ఇంజనీరింగ్, పీజీ, డిగ్రీ, ఇంటర్ కాలేజీలకు పూర్తి ఫీజు ఇస్తున్న ప్రభుత్వం బీసీ విద్యార్థులకు ఇవ్వడం లేదన్నారు.బీసీ విద్యార్థులకు కూడా కాలేజీ ఫీజు ఎంత ఉంటే అంత ప్రభుత్వమే ఇవ్వాలని కోరారు.కాలేజీ చదివే విద్యార్థులకు మెస్‌చార్జి రూ.1500 ఇస్తున్నారన్నారు. ఇప్పటి ధరలకు అనుగుణంగా రూ.3 వేలివ్వాలని కోరారు.ఐదు నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు రూ.1100 ఇస్తున్నారని,రూ.2 వేలు ఇవ్వాలని కోరారు. అలాగె బీసీ హాస్టల్ సమస్యలు పరిష్కరించి హాస్టల్ కు సొంత భవనాలు నిర్మించాలని అన్నారు.ఈ ధర్నాలో పోలీసులు,బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడితో పాటు మరికొంత మంది బీసీ విద్యార్థి సంఘం నాయకులను అరెస్టు చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థిసంఘం రాష్ట్ర కార్యదర్శి వేముల రాము,పరాల సాయి, పచ్చిపాల ఎల్లేష్, నవీన్, రాజేష్, తరుణ్ తేజ్, శైలజ, సౌజన్య, శిరీష్, పావని, అశోక్, మహేష్, గణేశ్, రాజు, ప్రశాంత్‌భూషణ్ పటేల్ పాల్గొన్నారు.