Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయివేటీకరణ చర్యలను మోడీ సర్కార్ ఉపసహరించుకోవాలి
- నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
- 12న నిరసన చేపట్టాలి
నవతెలంగాణ-నల్లగొండ
సింగరేణి, ఎన్టీపీసీ ,విద్యుత్ సంస్థల ప్రయివేటీకరణ నిర్ణయాలను ఉపసంహ రించుకోవాలని కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈనెల 12న మోడీ గో బ్యాక్ అనే నినాదంతో జరిగే నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపా ధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి పిలుప ునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమరయ్య భవన్లో సీఐటీయూ నల్లగొండ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలు సింగరేణి, ఎన్టీపీసీ, విద్యుత్తు సంస్థలను ప్రయివేటీ కరించాలని నిర్ణయాన్ని వ్యతిరేకించాలని పిలుపు నిచ్చారు.సంవత్సరం క్రితమే ప్రారంభమైన రామ గుండం ఎరువుల ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభిస్తామని చెప్పడం సిగ్గుచేటనిఅన్నారు. సింగరేణి సంస్థ నాలుగు బొగ్గు బావులకు అనుమతించాలని మూడు నాలుగు వేలకే బొగ్గు ఇస్తామని సింగరేణి సంస్థ అనుమతులు కోరిన కార్పొరేట్ సంస్థ ఆదాని ద్వారా ఆస్ట్రేలియా నుంచి బొగ్గు తెప్పించుకోవడం ఏమిటని ప్రశ్నించారు. రైతులకు ఉచిత విద్యుత్ అందకుండా ప్రయివేటీ కరించాలని చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలన్నారు. ఈ నెల 12న మండల నియోజకవర్గ కేంద్రాలలో అన్ని కార్మిక సంఘాలు కలిసి నల్లజెండాలను ఎగరవేసి గో బ్యాక్ మోడీ అంటూ నిరసనలు తెలియజేయాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఈనెల ఆఖరి నాటికి మండల సమన్వయ కమిటీ మహాసభలు జిల్లా ,రాష్ట్ర రంగాల మహాసభలు పూర్తిచేయాలని డిసెంబర్ మొదటి వారంలో జరిగే జిల్లా మహాసభల సందర్భంగా చిట్యాలలో నిర్వహించే బహిరంగ సభలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నవంబర్ 12న అంగన్వాడి, 15న హమాలీ ఫెడరేషన్ 20న మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య ,జక్కల రవికుమార్, తిరుపతి రామ్మూర్తి దయానంద్, రొండి శ్రీనివాస్, కానుగు లింగస్వామి, భీమ గాని గణేష్, రామచంద్రం, సాగర్ల యాదయ్య, వరికుప్పల ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.