Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
పట్టణంలో మౌలిక వసతులకల్పన,సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీపురంకాలనీ 2వ వార్డులో మంచినీటి పైపులైన్పనులను ఆమె ప్రారంభించి మాట్లాడారు. పురపాలకసంఘం పరిధిలోని వివిధవార్డులలో మొత్తం రూ.3.33కోట్ల వ్యయంతో మంచినీటి పైపులైన్ పనులు జరుగుతున్నాయన్నారు.రాబోయే రోజుల్లో ఎక్కడా మంచినీటి కొరత రాకుండా చూస్తామన్నారు.అనంతరం వార్డులో పర్యటించి అక్కడ జరుగుతున్న రోడ్డుపనులు, డ్రయినేజీ పనులను పరిశీలించారు.సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పెండెం వెంకటేశ్వర్లు, గుండెపనేని పద్మనాగేశ్వర్రావు, నాయకులు బషీర్, లక్ష్మీనారాయణ, భరత్, గురునాధం, చందు, కిరణ్, అన్నపూర్ణ, మౌలాలి, మట్టపల్లి శ్రీను, సరోజిని, ఆర్పీ అనిత, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.