Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నూతనకల్
రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దని ఎంపీపీ భూరెడ్డి కళావతి సంజీవరెడ్డి, జెడ్పీటీసీ కందాల దామోదర్‌రెడ్డి లు అన్నారు.శనివారం మండల పరిధిలోని లింగంపల్లి, మాచనపల్లి,దిర్శనపల్లి గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలుకేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని, రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు.ఈ కార్యక్ర మంలో పీఏసీఎస్ చైర్మెన్ కనకటి వెంకన్న,టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మున్న మల్లయ్యయాదవ్, సర్పంచులు గోరుగంటి ఉషారామ్ కిషన్‌రావు, కుందెన అక్కమ్మ,భదావత్ సావిత్రిచక్రధర్, ఎంపీటీసీ-2 పన్నాల రమా మల్లారెడ్డి,నాయకులు బద్దం ప్రశాంత్‌రెడ్డి, ఏపీఎం కర్నాకర్, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.
పెన్‌పహాడ్ :రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఎంపీపీ నెమ్మాది భిక్షం, జెడ్పీటీసీ మామిడి అనిత అంజయ్య అన్నారు.మండలపరిధిలోని మహ్మదాపురం గ్రామంలో ధాన్యం కొనుగోలుకేంద్రాన్ని డీఆర్డీఏ పీడీ సుందరి కిరణ్‌కుమార్‌తో కలిసి వారు ప్రారంభించి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో ఏపీఎం అజరునాయక్, సీసీలు చెన్నయ్య, సైదులు, ఎంపీటీసీ గద్దల పవన్, సర్పంచ్ రజిని సుధాకర్, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొంగరి యుగంధర్, టీఆర్‌ఎస్‌జిల్లా నాయకులు సముద్రాల రాంబాబు, సంఘబంధం అధ్యక్షురాలు ఆంగోతు దేవిలి, ఉపసర్పంచ్ భూక్యాలాలు, వీబీకే కొండేటి విజయ, సంఘ బంధం అధ్యక్షురాలు దేవిలి, కార్యదర్శి సముద్రాల సత్యవతి పాల్గొన్నారు.