Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సీహెచ్.రాములు
నవతెలంగాణ-హుజూర్నగర్
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేయకుండా వెంటనే చేపట్టాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సీహెచ్.రాములు అన్నారు.శనివారం ఆ సంఘం జిల్లా కార్యదర్శి దామోదర్ అధ్యక్షతన జరిగిన హుజూర్ నగర్,మఠంపల్లి మండలాల ఉపాధ్యాయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యావిధానం విద్యార్థులను సాంకేతికత అభివృద్ధి వైపు కాకుండా మతతత్వమైన కాషాయీకరణ వైపు విద్యార్థుల దృష్టి మళ్లించే విధంగా ఉందన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. విద్యారంగానికి కావాల్సిన నిధులను పూర్తిస్థాయిలో కేటాయించాలన్నారు.ఈ సమవేశంలో జిల్లా అధ్యక్షుడు ఎస్.అనిల్‌కుమార్,జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, కార్యదర్శులు వీరారెడ్డి, కమల, సీనియర్ ఉపాధ్యాయుడు బీరెల్లి శ్రీనివాసరెడ్డి, చిన్నగాని సైదులు,హుజూర్నగర్, మఠంపల్లి మండలాల అధ్యక్ష కార్యదర్శులు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.