Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- భూదాన్‌పోచంపల్లి
జాతీయ నాణ్యతా ప్రమాణాల ప్రకారము వైద్య, ఆరోగ్యసేవల నిపుణుల బృందం శుక్రవారం ,శనివారం ప్రాధమిక ఆరోగ్యకేంద్రం లో అందిస్తున్న వైద్యసేవాలను పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ ఢిల్లీ నుండి డాక్టర్ పంకజ, డాక్టర్ కృష్ణ ప్రసాద్ , నేషనల్ క్వాలిటీ అనలిస్ట్స్, ఆరోగ్య కేంద్రంలోని ఆరు విభాగాలుగా విభజించి పరిశృలించారు. అవుట్ పేషెంట్ సేవలు, 2 ఇన్ పేషెంట్ సేవలు , 3 ప్రసూతి సేవలు , 4. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు 5 ల్యాబ్ సేవలు ,6 ఆరోగ్య కేంద్ర పర్యవేక్షణ మొదలగు విభాగాలను ను క్షుణ్ణంగా పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ పరిపూర్ణ చారి, జిల్లా నాన్ కమ్యూనకబుల్ డీసీఎస్ అధికారి డాక్టర్ సుమన్ కళ్యాణ్ , చౌటుప్పల్ డివిజన్ ఉప జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ యశోద ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ యాదగిరి , డాక్టర్ శ్రీధర్ , డాక్టర్ జ్యోతి, పల్లె దవాఖాన డాక్టర్స్ అమరేందర్,రాకేష్,సుచరిత,కపిల , అన్ని విభాగాల వైద్య ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.