Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరి
దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయ లబ్ధి కోసమే తెలంగాణలో పర్యటన చేస్తున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ అన్నారు .శనివారం ఆ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రిన్స్ చౌరస్తా వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఎన్నికల ముందు ప్రధానమంత్రి దేశంలో ఉన్న ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ప్రతి పేద కుటుంబానికి రూ.15 లక్షల బ్యాంకులో ఇస్తానని ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన మాట అమలు చేయలేదన్నారు. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తూ ప్రభుత్వ రంగ సంస్థల నమ్మేస్తుందని కులాల మతాల మధ్యన శిక్షి పెడుతూ ప్రజలను విడదీస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ ం మండల కార్యదర్శి దయ్యాల నరసింహ నాయకులు వల్లస్ అంజయ్య బర్ల వెంకటేశం వనం రాజు చింతల శివ వెంకటేష్ భాగ్య వనం రాజు గిరి పాల్గొన్నారు.
దాసరి పాండు అరెస్ట్
ప్రధాని మోడీి పర్యటన సందర్బంగా భువనగిరిలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి దాసరి పాండును అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
రామన్నపేట : తెలంగాణ రాష్టానికి తీరని అన్యాయం చేస్తూ ప్రజలను మాయ చేయడానికే తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గో బ్యాక్ అంటూ శనివారం మండల కేంద్రంలోని సుభాష్ సెంటర్లో నల్ల జెండాతో సీపీిఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆపార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మేక అశోక్ రెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరమే ప్రారంభమైన రామగుండం ఎరువు కర్మాగారాన్ని మళ్ళీ ప్రారంభించడం ఎంటని ప్రశ్నించారు. దేశ సంపదను కార్పోరేట్లకు దారదత్తం చేస్తూ ప్రజల్లో మత విద్వేశాలు రెచ్చగొడుతున్న నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రంలో ఏం పని అన్నారు.. కరెంటును ప్రయివేటీకరణ చేస్తూ సింగరేణి గనులను అమ్మాలని చూస్తున్నారాన్నారు.ఈ కార్యక్రమంలో సిపియం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, జిల్లా కమిటి సభ్యులు వనం ఉపేందర్, మండల కార్యదర్శివర్గ సభ్యులు బోయిని ఆనంద్, బల్గూరి అంజయ్య, మామిడి వెంకట్ రెడ్డి, బావండ్లపల్లి బాలరాజు, కల్లూరి నగేష్, గన్నెబోయిన విజయభాస్కర్, పిట్టల శ్రీనివాస్, యంపిటిసి బడుగు రమేష్, గొరిగె సోములు, అప్పం సురేందర్, బావండ్లపల్లి సత్యం, దోమలపల్లి నర్సింహ్మ, శానగొండ వెంకటేశ్వర్లు, శ్రీకృష్ణ, వళ్ళమల్ల రమేష్, కూనూరు గణేష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
వలిగొండ : దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రామగుండం పర్యటనను వ్యతిరేకిస్తూ సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా వలిగొండ మండల కేంద్రంలోని శనివారం నల్లజెండాలతో 'మోడీ గో బ్యాక్' అంటూ బ్యానర్‌ను ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, మండల కార్యదర్శి వర్గ సభ్యులు మెరుగు వెంకటేశం కల్కూరి రామచందర్, మండల కమిటీ సభ్యులు గాజుల ఆంజనేయులు జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు, పట్టణ కార్యదర్శి గార్దసు నర్సింహ, మండల కమిటీ సభ్యులు దుబ్బ లింగం,దొడ్డి భిక్షపతి, డీవైఎఫ్ఐ మండల కార్యదర్శి ధ్యానబోయిన యాదగిరి, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి వేముల నాగరాజు,నాయకులు కొమ్ము స్వామి,తుమ్మల సంజీవ రెడ్డి,పిట్టల అంజయ్య,బొడ్డు రాములు,దొడ్డి యాదగిరి,ఏడుమేకల శ్రీశైలం,వేముల జయసూర్య,పోలేపల్లి స్వామి,నరేష్ తదితరులు పాల్గొన్నారు.
సంస్థాన్ నారాయణపురం : సీపీిఐ(ఎం).మండల.కమిటీ ఆధ్వర్యలో శనివారం . నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా. కార్యదర్శి వర్గసభ్యులు,దొనూరు నర్సిరెడ్డి, జిల్లకమిటీ సభ్యులు గుంటోజు శ్రీనివాస్ చారి, మండల కార్యదర్శి దోడ యాదిరెడ్డి,తుమ్మల నర్సిరెడ్డి,నాయకులు చింతకాయల నరసింహ, సురవి కిరణ్, శివగోని మారయ్య, బత్తుల వెంకటయ్య, జనిగల నరసింహ, చిలువేరు గాలయ్య తదితరులు పాల్గొన్నారు.
చౌటుప్పల్ : ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలంగాణ పర్యటనను వ్యతిరేకిస్తూ శనివారం చౌటుప్పల్ పట్టణకేంద్రంలోని జాతీయ రహదారిపై సీపీఐ(ఎం) మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు చెవిలో పూలు పెట్టుకొని నరేంద్రమోడి గో బ్యాక్ అంటూ నినానదాలు చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మున్సిపల్ కార్యదర్శి బండారు నర్సింహా మాట్లాడారు. ఎప్పుడో నిర్మించిన ఎరువుల పరిశ్రమను ఇప్పుడు ప్రారంభించడం ఏమిటని ప్రశ్నించారు. విభజన హామీలను అమలుచేయకుండా తెలంగాణలో నరేంద్రమోడికి తిరిగే అర్హత లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎమ్‌డి.పాషా, మున్సిపల్ వైస్‌ఛైర్మన్ బత్తుల శ్రీశైలం, నాయకులు ఆకుల ధర్మయ్య, గోశిక కరుణాకర్, గంజి రామచంద్రం, ఎర్ర ఊషయ్య, బొమ్మకంటి కృష్ణ, బొడ్డు అంజిరెడ్డి, నెల్లికంటి నర్సింహా, ఉష్కాగుల శ్రీను పాల్గొన్నారు.
అడ్డగుడూర్ : మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద శనివారం టీఆర్ఎస్ యూత్ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనను వ్యతిరేకిస్తూ మోడీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ నల్ల జెండాలు , నల్ల బ్యాడ్జీలు ధరించి అంబేద్కర్ చౌరస్తా నుండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు లింగాల అశోక్ గౌడ్ , యూత్ ప్రధాన కార్యదర్శి మేకల జగన్ , జక్కుల యాదగిరి , ప్రచార కార్యదర్శి అలువాల శంకర్ , మందుల కిరణ్ , పాక సింహాద్రి , బాలెంల పరశురాములు , జనార్ధన్ , మారోజు వెంకన్న , టిఆర్ఎస్ యూత్ నాయకులు బాలెంల అరవింద్ , గూడపు నరేష్ , జిల్లా శివాజీ , అఖిల్ , కత్తుల నరేష్ , వజ్జే సతీష్ , ఖమ్మంపాటి నరేందర్ , లక్ష్మణాచారి , సూర్య , ప్రభుదాస్ , మహేందర్, పలు గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మోత్కూరు: తెలంగాణకు విభజన హామీలు నెరవేర్చకుండా ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనకు రావడాన్ని నిరసిస్తూ శనివారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో ప్రధాన రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఎఫ్ఎస్ఐ జిల్లా అధ్యక్షుడు బుర్రు అనిల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రానికి రావాల్సిన ట్రైబల్ యూనివర్సిటీ, ఐటీఐఆర్, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, నీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా, జీడీపీలో ఆరుశాతం నిధులు లాంటి హామీలేవీ నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు నర్సింహ, వేణు, ప్రవళిక, శిరీష, అరణ్య, అంజలి, సమీరా, రేష్మ, అక్షిత, అమూల్య, నిఖిత, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.