Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీసీసీబీచైర్మెన్ గొంగిడి మహేందర్‌రెడ్డి
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
టిఆర్ఎస్ పార్టీలోని ప్రతి కార్యకర్త కుటుంబానికి ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ కచ్చితంగా అండగా ఉంటాయని డీసీసీబీచైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. ఆలేరు మండలం కొలను పాక గ్రామానికి చెందిన కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు అమృతం బాలరాజు ,యూత్ కాంగ్రెస్ నాయకులు దూసరి గణేష్ ,కుప్పల మహేష్ ,ప్రవీణ్‌తో పాటు సుమారు 250 మంది కాంగ్రెస్ కార్యకర్తలు శనివారం పట్టణంలోని గొంగిడి నిలయంలో టీిఆర్‌ఎస్‌లో చేరారు .వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి ఆయన కండువాలు కప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారన్నారు .సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయన్నారు.టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక గ్రామాలు పట్టణాల రూపురేఖలు మారిపోయాయని తెలిపారు .ఆలేరు నియోజకవర్గం ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని కొనియాడారు .ఈ కార్యక్రమంలో ఆలేర్ టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ యాదవ్ ,వైస్ ఎంపీపీ గాజుల వెంకటేష్ యాదవ్ ,రైతుబంధు అధ్యక్షుడు డాక్టర్ రమేష్ గౌడ్ ,సర్పంచ్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి ,ఉప సర్పంచ్ అనిత అంజయ్య ,మార్కెట్ కమిటీ డైరెక్టర్ నరసింహులు ,సింగిల్ విండో డైరెక్టర్ మల్లేష్ గౌడ్ ,టిఆర్ఎస్వి మండల అధ్యక్షుడు భాను తదితరులు పాల్గొన్నారు.