Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-మోత్కూరు
రామన్నపేట చేనేత క్లస్టర్ లో అర్హులైన కార్మికులకు పని కల్పించాలని చేనేత కార్మిక సంఘం జిల్లాప్రధానకార్యదర్శి గుండు వెంకటనర్సు డిమాండ్ చేశారు. శనివారం మోత్కూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అర్హులకు కాకుండా అనర్హులకు అవకాశం కల్పిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయని, అర్హులైన కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరిన పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షుడు రచ్చ యాదగిరిపై దాడి చేయడం హేయమైన చర్య అని, ఆయనపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జిల్లా అధికారులుస్పందించి క్లస్టర్ లో అర్హులకు ప్రాధాన్యత ఇవ్వాలని, లేనిపక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులకు ప్రభుత్వం అన్ని రకాల ప్రభుత్వ పథకాలు అమలు చేయాలనికోరారు. ఆయన వెంట నాయకులు పసునూరి యాదయ్య, పసునూరి రమేష్ ఉన్నారు.