Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
రామగుండంలో ఎరువుల పరిశ్రమను ప్రారంభించుటకు ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు వస్తున్నారని, ఆయన పర్యటనతో తెలంగాణకు ప్రయోజనం లేదని, గో బ్యాక్ మోడీ అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి అన్నారు. శనివారం స్థానిక నల్లలబావి సెంటర్లో పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తూ గో బ్యాక్ నరేంద్ర మోడీ అని నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పుడో నిర్మించి నడు స్తున్న వేల కోట్ల రూపాయల లాభాల్లో నడుస్తున్న ఎరువుల పరిశ్రమను ఇప్పుడు ప్రారంభించడం ఏమిటని ప్రశ్నించారు. విభజన చట్టంలో ఉన్న ఏ ఒక్క హామీని నేటికీ అమలు చేయకుండా నేడు ఒట్టి చేతులతో రాష్ట్రానికి రావడం సిగ్గుచేటన్నారు.ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ శక్తులకు కారు చౌకగా కట్టబెట్టాడని విమర్శించారు.కార్మిక చట్టాలను మారుస్తూ నాలుగు కోడులుగా విభజిస్తూ కార్మికుల మనుగడకే నష్టం జరిగేలా కేంద్రం వ్యవహరిస్తుందన్నారు.ఇప్పటికే పెరిగిన పెట్రోల్,డీజిల్, వంటగ్యాస్, ఎరువుల ధరలతో ఇబ్బంది పడుతున్న ప్రజలను ఆదుకోవడంలో బీజేపీ విఫలమైందన్నారు. పసిపాపలు తాగే పాలపైనా జీఎస్టీ విధించిన చరిత్ర మోడీకే దక్కుతుందన్నారు.ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ ప్రజలపై మోయలేని భారాలు మోపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తున్న గవర్నర్ల వ్యవస్థను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.గవర్నర్లను కేంద్రప్రభుత్వం ఏజెంట్లుగా తయారు చేసుకుంటున్నారని విమర్శించారు.బీజేపీ అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కలిసొచ్చే శక్తులను కలుపుకొని పెద్దఎత్తున ప్రజాపోరాటాలను నిర్వహిస్తామన్నారు.ఈ కార్యక్ర మంలో జిల్లా కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు,మట్టిపల్లి సైదులు, కోటగోపి, ఎల్గూరి గోవింద్, జె.నర్సింహారావు,దండావెంకటరెడ్డి, చెరుకు ఏకలక్ష్మి, వేల్పుల వెంకన్న, ధనియాకుల శ్రీకాంత్, వీరబోయిన రవి, కొప్పుల రజిత, చిన్నపంగనర్సయ్య, వ్యవసాయకార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకలపల్లి రాములు, నాయకులు దోసపాటి భిక్షం, సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.
మోడీని అడ్డుకుంటాం
కోదాడరూరల్ :రామగుండం ఫ్యాక్టరీని జాతికి అంకితం చేస్తున్నానని చెప్పి దొంగచాటున ప్రయివేట్‌పరం చేసేందుకు ప్రధాని మోడీ వస్తున్నారని వారిని అడ్డుకోవాలని సీపీఐ(ఎం)జిల్లా కమిటీ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు అన్నారు. పట్టణంలోని ప్రధాన రహదారిపై ప్రధానమంత్రి మోడీ రాకను నిరసిస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి మిట్టగనుపుల ముత్యాలు, వ్యవసాయకార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు వెలిది పద్మావతి, రైతుసంఘం జిల్లా నాయకులు ఏనుగుల వీరాంజ నేయులు, ఏసోబు, సత్తిరెడ్డి, శ్రీను, తిరపయ్య, ఏడుకొండలు, ఉపేందర్ ,సిద్ధల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
తిరుమలగిరి : మండలకేంద్రంలోని చౌరస్తాలో సీపీఐ ఆధ్వర్యంలో నల్లజెండా, నల్లబ్యాడ్జీలు ధరించి ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఎల్లాంల యాదగిరి, మండల కార్యదర్శి వాసిరెడ్డిసోమిరెడ్డి, వ్యవసాయ కార్మికసంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి ఇక్బాల్, ఏఐవైఎఫ్ మండల కన్వీనర్ తిప్పిరాల శ్రీకాంత్, తొండ గ్రామశాఖ కార్యదర్శి కనుక అశోక్, రైతుసంఘం మండల కార్యదర్శి నాగులగాని వెంకన్న, గొడుగు సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
చిలుకూరు:చిలుకూరు మండలకేంద్రంలోని కోదాడ-జడ్చర్ల రహదారిపై సీపీఐ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి దిష్టిబొమ్మ దహనం చేశారు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి మండవ వెంకటేశ్వర్లు, చిలువేరు ఆంజనేయులు,ఎస్కె.సాహెబ్‌అలీ, కొండలు, వడ్డేపల్లి కోటేశ్, కనకయ్య పాల్గొన్నారు.
సూర్యాపేటకలెక్టరేట్ :ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో సూర్యాపేట కొత్త బస్టాండ్ వద్ద మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు.ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ ు జిల్లా కన్వీనర్ రామోజీ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం వచ్చాక ఈ 8 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ ఆస్తులను ఆదాని అంబానీ కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెడుతూ దేశ సంపదను వారికి దోచిపెడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి ఎర్ర అఖిల్,జీవన్, వాజీదు, యాకోబు, శ్రీకాంత్, వీరబాబు,నవీన్, కృష్ణ, రాము పాల్గొన్నారు.
మునగాల: రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి ప్రధాని మోడీ రాకను ప్రతిఒక్కరూ వ్యతిరే కించాలని సీపీఐ(ఎం)జిల్లా కమిటీ సభ్యులు దేవరం వెంకటరెడ్డి అన్నారు.మోడీ రాకను నిరసిస్తూ నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు దేవరం శ్రీనివాస్‌రెడ్డి, గడ్డం వినోద్ పాల్గొన్నారు.
హుజూర్నగర్: పట్టణంలో సీపీఐ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యాలయం ఎదుట నల్లజెండా ఎగురవేసినిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పాలకూరిబాబు, నాయకులు ఎల్లావుల రమేష్ ,వెంకటేశ్వర్లు, జక్కుల రమేశ్,జక్కుల శ్రీను, రమణ, వెంకటేశ్వర్లు, చక్రాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.