Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హుజూర్నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి
నవతెలంగాణ-హుజూర్నగర్
పుస్తకాలు చదవడం వల్ల అపారమైన జ్ఞానాన్ని ఆర్జించవచ్చని, ఎన్నో తెలవని విషయాలను తెలుసు కోవచ్చని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు.శనివారం స్థానిక ప్రియదర్శిని కళాశాలలో కవి రచయిత పుప్పాల కృష్ణమూర్తి రచించిన 'రాజహంస' అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.జెడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి ఇద్దరు మాంత్రికులు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు.సమాజాన్ని చైతన్య పరిచే విధంగా పుస్తక రచనలు ఉండాలన్నారు. విజ్ఞానాన్ని పెంపొందించుకునే విధంగా నిత్యజీవితంలో అనేక విధాలుగా ఉపయోగపడే విధంగా పుస్తక రచనలు ఉండే విధంగా కవులు తమ రచనలను చేయాలన్నారు .సమాజానికి దిశాదశ మార్గ నిర్దేశం చేసే విధంగా నిత్యజీవితంలో ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు. రచయిత పుప్పాల కృష్ణమూర్తి చేసే రచనలు విజ్ఞానాన్ని పెంపొందించే విధంగా ఉన్నాయన్నారు. అటువంటి రచనలు చేస్తున్నందుకు ఆయన్ను అభినందించారు ఆయన చేసిన రచనలకు తెలుగు యూనివర్సిటీ వారు కీర్తి పురస్కారాన్ని ఇచ్చారని, అదేవిధంగా కోదాడలో పట్టణంలో అబ్దుల్ కలాం అవార్డును కూడా ప్రదానం చేసినట్టు తెలిపారు.కృష్ణమూర్తి తనకు మిత్రుడు అని, చాలా కాలం నుండి తనకు తెలుసన్నారు.భవిష్యత్లో కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా తమ పుస్తక రచనలు చేయాలని కోరారు.మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వంటి వారు సైతం పుస్తకాల పఠనం వల్ల అపారవిజ్ఞానాన్ని ఆర్జించారన్నారు.విద్యార్థులు సెల్ఫోన్లకు,చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు.జెడ్పీటీసీ ొప్పుల సైదిరెడ్డి మాట్లాడుతూ కృష్ణమూర్తి రచించిన ఇద్దరు మాంత్రికులు పుస్తకంలో ఇద్దరు మాంత్రికులలో ఒకరు చెడు చేయాలని చూస్తుండగా మరొకరు మంచి చేయాలని చూస్తారన్నారు. చివరికి మంచే గెలుస్తుందని చెడు ఓడిపో తుందన్నారు.ఈర్య్శ,ధ్వేషాలు , చెడు అనేవి మానవుని ఎదుగుదలకు అడ్డంకిగా నిలుస్తా యన్నారు.చక్కని మెసేజ్ ఇచ్చేవిధంగా పుస్తకాన్ని రచించడం అభినందనీ యమన్నారు.ఈ కార్యక్రమంలో ప్రియదర్శని కళాశాల ప్రిన్సిపాల్, కరస్పాండెంట్ పశ్య శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించగా కేఆర్ఆర్ కళాశాల లెక్చరర్ వెంకటేశ్వర్లు,బాడిసే హనుమంతరావు, కేఎల్ఎన్.రెడ్డి, ఎంపీటీసీ విజయలక్ష్మి, జక్కులవెంకటేశ్వర్లు, మున్సిపల్ మాజీ చైర్మెన్ దొంతగాని శ్రీనివాస్ పాల్గొన్నారు.