Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని 65వ నెంబర్ జాతీయ రహదారిపై తంగడపల్లి రోడ్డు వద్ద ఉన్న క్రాసింగ్ దగ్గర ఏర్పాటుచేసిన బారీకేడ్లను తొలగించాలని డిమాండ్‌చేస్తూ ఆదివారం డీవైఎఫ్ఐ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎమ్‌డి.ఖయ్యుమ్ పాషా మాట్లాడారు.చౌటుప్పల్ నుండి తంగడపల్లి రోడ్డు మీదుగా సంస్థాన్నారా యణపురం, మునుగోడు, చండూరు తదితర గ్రామాలకు వెళ్లడానికి ఏకైక మార్గంలో బారికేడ్లను ఏర్పాటుచేయడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. స్థానిక ప్రభుత్వాసుపత్రికి, చిన్న పిల్లల ఆస్పత్రికి వెళ్లాలంటే వలిగొండ రోడ్డు నుండి బస్టాండ్ మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియంత్రణలో విఫలమయ్యారన్నారు. ప్రజలు, వాహనదారులకు రాకపోకలకు ఇబ్బందిగా ఉన్న బారికేడ్లను తొలగించి, ప్రజలు, వాహనదారుల ఇబ్బందులు తొలగించాలని కోరారు. అనంతరం ట్రాఫిక్ సీఐకి వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్చైర్మెన్్ బత్తుల శ్రీశైలం, సీపీఐ(ఎం) మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ గోపగోని లక్ష్మణ్‌గౌడ్, డీవైఎఫ్ఐ మున్సిపల్ అధ్యక్షులు దేపరాజు, నాయకులు గోశిక కర్నాకర్, ఎమ్‌డి.ఖాసీమ్, ఎర్ర ఊషయ్య, గంట శంకర్‌రెడ్డి, బోయ యాదయ్య, ఎమ్‌డి.ఇర్ఫాన్, కాసుల లక్ష్మయ్య, జ్యోతిబసు, రియాజ్, యాకుబ్ పాల్గొన్నారు.