Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భక్తుల భారీ క్యూలైన్
- అంతట ట్రాఫిక్ జాం
- రద్దీతో స్థానికులు, భక్తుల ఇబ్బందులు
నవతెలంగాణ-యాదాద్రి
యాదగిరికొండపై కార్తీక సందడి కొనసాగుతోంది.ఆదివారం సెలవు దినం కావడంతో రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు ఆశేషంగా క్షేత్ర సందర్శనకు వచ్చారు. ఈ రద్దీతో ఆలయ పరిసరాలు, కొండకింద కల్యాణకట్ట, సత్యదేవుని వ్రత భవనం, లక్ష్మీపుష్కరిణి భక్తజనంతో కిక్కిరిసిపోయింది. మెయిన్ టెంపుల్‌తో పాటు అనుబంధ ఆలయాలు పాతగుట్ట ఆలయం,రామలింగేశ్వరస్వామి ఆలయంలో భక్తులతో కోలాహాలం నెలకొంది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తలు క్యూలైన్లల్లో భారీగా వేచి ఉన్నారు. దర్మ దర్శనం 4గంటలు, స్సెషల్ దర్శనం 2గంటల సమయం పట్టింది.తిరువీదులు, ముఖమండపం, క్యూ కాంప్లేక్స్, క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం ఆలయ పూజారులు వేద మంత్రోచ్చరణ నడుమ వైభవంగా జరిపారు. ఇతర ప్రయివేట్ వాహనాలకు కొండపైకి అనుమతులు లేకపోవడంతో రద్దీకి సరిపడా బస్సులు లేక నరకయాతన పడ్డారు. సాయంత్రం ప్రయాణికులతో యాదగిరిగుట్ట బస్టాండ్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. బస్సులు లేక రాత్రి 10గంటల వరకు వేచి ఉండటం కాక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యాదగిరికొండ ఆలయ పరిసరాలే కాక కొండకింద కూడా భక్తుల రద్దీ నెలకొంది. ఈ రద్దీకి బస్టాండ్, పాతగుట్ట చౌరస్తా, వైకుంఠ ద్వారం సమీపంలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు పొద్దంత ట్రాఫిక్ నియంత్రణ చేస్తూనే ఉన్నారు. కొండచుట్టూ వాహనాలు పార్కింగ్ కావడంతో కొండపై నుండి ఫొటోలు ఆకర్షణీయంగా వచ్చాయి.క్షేత్ర సందర్శనకు వచ్చిన భక్తులు అసౌకర్యాలతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ గోవిందా నామస్మరణతో ఇష్టదైవాన్ని తలచుకుంటు భక్తజనం బాదలను మరిచిపోయారు. సౌకర్యాల లేని కారణంగా మహిళలు, పిల్లలు ఇబ్బందులు పడ్డామని పలువురు భక్తులు వాపోయారు. ఎంత మంది తమ బాదలను వెళ్లడిస్తే అంత బాగ ఇక్కడి అధికారులు పని చేస్తున్నట్టని భక్తులు అనుకున్నారు.సౌకర్యాల కల్పనకు ఎలాంటి చర్యలు చేపట్టని అధికారులు భక్తులు ఇచ్చే కానుకల కోసం అలాగే ఇతర ఆదాయ మార్గాల్లో వసూలుకు పూనుకుంటారు. కార్తీక మాసం సందర్భంగా ఈ కొండపై ప్రత్యేకపూజలు జరిపారు. శివాలయంలో శివుడికి దీపారాదన చేపట్టారు. కొండకింద వ్రత పూజల్లో అధిక సంఖ్యలో పాల్గొన్నారు.