Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూదాన్‌పోచంపల్లి
బహుజన సాహిత్య అకాడమీ ప్రదానం చేసే ''ఉత్తమ సర్పంచ్'' జాతీయ అవార్డును ఆదివారం ఢిల్లీలో ప్రముఖుల చేతుల మీదఅవార్డును అందుకున్న పిల్లాయిపల్లి గ్రామ సర్పంచ్ అందాల హరీష్ యాదవ్అందుకున్నారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలతో పాటు గ్రామాన్ని సుందరవనంగా తీర్చిదిద్దడంలో అహర్నిశలు కృషి చేశారన్నారు. గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేస్తూ జిల్లాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారన్నారు.ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా పరిసరాల పరిశుభ్రత పట్ల ఎంతో శ్రద్ధ తీసుకున్నారన్నారు.గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనం, ప్రాథమికఆరోగ్య కేంద్రం, తాగునీరు, డంపింగ్ యార్డు, వైకుంఠధామం, పల్లెప్రకృతి వనం, క్రీడా మైదానం, అండర్ గ్రౌండ్డ్రయినేజీ వంటి సౌకర్యాలు కల్పించారన్నారు.మొక్కలు విరివిగా నాటి హరిత గ్రామంగా తీర్చిదిద్దారని అన్నారు. వారి సేవా కార్యక్రమాలు గుర్తించి అవార్డుకు ఎంపికయ్యారన్నారు.సర్పంచ్ అందెల హరీష్ మాట్లాడుతూ దేశ రాజధానిలో ఈ అవార్డును అందుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అవార్డుకు ఎంపిక చేసిన రాధాకృష్ణకు, అకాడమీ రాష్ట్ర కమిటీ సభ్యులు ముక్కెర సంపత్‌లకు హరీష్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గూడూరు బుచ్చిరెడ్డి పిల్లాయిపెల్లి కో ఆప్షన్ సభ్యులు మార్త సత్యనారాయణ పాల్గొన్నారు.