Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అతంగడపల్లి చౌరస్తా రోడ్డు బందు చేసిన ట్రాఫిక్ పోలీసులు
- అవాహనదారులకు తప్పని తిప్పలు
- అట్రాఫిక్పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేసిన సీపీఐ(ఎం)
నవతెలంగాణ-చౌటుప్పల్‌రూరల్
రోడ్లపై ప్రజలకు జరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు తీర్చడానికి ట్రాఫిక్ పోలీసులు ఉంటారు.ఏ జంక్షన్లో కూడా ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ట్రాఫిక్ పోలీసుల ప్రధాన కర్తవ్యం. కానీ ఇందుకు భిన్నంగా చౌటుప్పల్ ట్రాఫిక్ పోలీసులు వ్యవహరిస్తున్నారు. చౌటుప్పల్ ట్రాఫిక్ పోలీసుల తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.చౌటుప్పల్ పట్టణకేంద్రంలో మూడు ముఖ్యమైన కూడళ్ళు ఉన్నాయి. చౌటుప్పల్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో 30 మందికి పైగా సిబ్బంది ఉన్నారు. ఇందులో కొద్ది మంది కోర్టు పనులు చూసుకున్నా కూడా మిగతా మంది ట్రాఫిక్ విధులు నిర్వర్తించాలి. ప్రతి కూడలి వద్ద ట్రాఫిక్ నియంత్రణ కోసం ఇద్దరు ట్రాఫిక్ కానిస్టేబుల్స్‌తో ట్రాఫిక్ క్లియర్ చేయాల్సి ఉండగా, ఇరువైపులా వాహనాలు సిగల్స్ వద్ద ఆపడానికి ఒక్కరే కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నారు. పట్టణంలో తంగడిపల్లి చౌరస్తా ముఖ్య కూడలి.హైదరాబాద్ వైపు నుండి వచ్చే వాహనాలు మునుగోడు, సంస్థాన్ నారాయణపురం వైపు వెళ్లే గ్రామాల వారు ఈ కుడలి నుండి వెళ్ళాలి. ట్రాఫిక్ పోలీసుల అనాలోచిత నిర్ణయంతో ఈ కుడలిని బందు చేశారు. చిన్న కొండూరు వైపు నుండి బస్టాండ్ కు వెళ్లాలన్నా కూడా చుట్టూ తిరిగి వలిగొండ క్రాస్‌రోడ్డు వద్దకు వెళ్లి యూటర్న్ తీసుకొని రావాల్సిన దుస్థితి ఉంది. హైదరాబాదు నుండి వచ్చే వాహనాలు తంగడపల్లికి వెళ్లాలన్నా కూడా వలిగొండ క్రాస్ రోడ్డు వద్దకు సుమారు రెండు కిలోమీటర్లు దూరం వెళ్లి యూటర్న్ తీసుకొని రావాల్సి ఉంటుంది. ట్రాఫిక్ సీఐ నిర్ణయం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడక తప్పడం లేదు. పట్టణానికి అటువైపు వెళ్ళాలన్నా, ఇటువైపు వెళ్ళాలన్నా అడ్డుగోడగా ఉంది.ఇక విధులు నిర్వహించాల్సిన ట్రాఫిక్ కానిస్టేబుల్స్ సెల్ఫోన్లో ఆడుకుంటూ, చాటింగ్‌లు చేస్తూ ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్నారు. చౌటుప్పల్ ట్రాఫిక్ పోలీసుల తీరుతో ప్రజలు ఇబ్బందులు పడక తప్పడం లేదు. ట్రాఫిక్ పోలీసులు సిగల్ దగ్గర ఇద్దరు ఉండి ఇరువైపులా ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించాలను వాహనదారులు కోరుతున్నారు.వెంటనే మూసివేసిన క్రాస్ రోడ్డు ను వెంటనే ఓపెన్ చేయాలని సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ట్రాఫిక్ నియంత్రణ పేరుతో దారులు మూసేయడం సరికాదు
డీవైఎఫ్ఐ మున్సిపాలిటీ కార్యదర్శి-యండి. ఖయ్యూం,
చౌటుప్పల్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ పేరుతో గ్రామాలకు వెళ్లే దారులను మూసివేస్తున్నారు. చౌటుప్పల్ పట్టణంలో మూడు ప్రధాన సిగల్స్ ఉన్నాయి. ట్రాఫిక్ స్టేషన్లో 30 మంది సిబ్బంది ఉన్నా కూడా కేవలం ఆరుగురు తోనే విధులు చేపిస్తున్నారు. తక్షణమే మూసివేసిన దారులను ఓపెన్ చేయాలి.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తంగడపల్లి క్రాస్ రోడ్డును మూసివేశాం
ట్రాఫిక్ సీఐ-కెవీ.విజయ్‌కుమార్
హైవేపై పట్టణంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువ అవుతుండడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తంగడపల్లి క్రాస్ రోడ్డు వద్ద రహదారిని మూసివేశాం. వాహనదారులు ఇబ్బందులు పడకుండా అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటాం. తంగడపల్లి చౌరస్తా రోడ్డును ఓపెన్ చేయాలి.తంగడపల్లి చౌరస్తా వద్ద మెయిన్ రోడ్డుపై వేసిన భారికేట్లను వెంటనే తొలగించాలని సీపీఐ(ఎం) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో చౌటుప్పల్ ట్రాఫిక్ సీఐ కేవి విజరుకుమార్‌కు వినతిపత్రం అందజేశారు.వినతిపత్రం అందజేసిన వారిలో చౌటుప్పల్ మున్సిపల్ వైస్ చైర్మెన్ బత్తుల శ్రీశైలం, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గోపగోని లక్ష్మణ్,పట్టణ నాయకులు ఎండి ఖయ్యూం, కోశిక కర్నాకర్, దేపరాజు, ఎర్ర ఉషయ్య, బోయ యాదయ్య తదితరులు ఉన్నారు.