Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జోన్-1లోని 17 మైనింగ్‌లు ప్రమాదరహితం
- సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్న చిన్నారులు
- ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన జబర్దస్త్ టీం
నవతెలంగాణ-పాలకవీడు
ప్రతిష్టాత్మక 37వ గనుల భద్రతావారోత్సవాలను డెక్కన్ సిమెంట్స్ యాజమాన్యం ఆదివారం విజయవంతంగా నిర్వహించింది.హైదరాబాద్ రీజియన్ మైనింగ్అధికారి, సుప్రియోచక్రబర్తి, డీసీఎల్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు ముఖ్యఅతిథులుగా హాజరై మైనింగ్ భద్రతా అంశాలపై అవగాహన కల్పించారు.నాలుగేండ్లుగా జోన్-1లోని 17 మైనింగ్‌లు ప్రమాద రహితంగా నిలవడంపై ఆనందం వ్యక్తం చేశారు.ఇంతటితో ఆగకుండా అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని రానున్న ప్రమాదాలను పసిగట్టి, సంస్థలు ఉత్పత్తిని కొనసాగించాలన్నారు. పెన్నా, సాగర్ప్రియ, నాగార్జున తదితర 17 సిమెంట్ కర్మాగారాల యజమాన్యం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.విరివిగా హాజరైన సిబ్బందికి భద్రతపై పలు అంశాలను ఉదాహరణలతో వివరించారు.20 ఏండ్లుగా మైనింగ్‌లో క్రమశిక్షణగా, ప్రమాదరహితంగా పనిచేస్తున్న ఉద్యోగులను వేదిక సన్మానించింది. నా భద్రత- నా బాధ్యత అనే విధంగా కార్మికులు పనిచేయటం వలన ఈ విజయాన్ని సాధించినట్లు యజమాన్యాలు స్పష్టం చేశాయి. మైనింగ్ విభాగంలో అనేక ఉద్యోగ, వృత్తి నైపుణ్య అవకాశాలు యువతకు వస్తుంటాయని వివరించారు.అనంతరం ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారులు చేసిన నృత్యాలు ఆకర్షణగా నిలిచాయి. జబర్దస్త్ టీం కమెడియన్స్ హైపర్ ఆది తదితరులు ఈవెంట్స్ చేసి కార్యక్రమంలో ఉత్సాహాన్ని నింపారు. కార్యక్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ కర్మాగార పరికరాల స్టాల్స్‌ను, నూతన ఉత్పత్తులను ప్రభుత్వ అధికారులతో కలిసి యాజమాన్యాలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీసీఎల్సీజీఎం శ్రీనివాసరాజు, జీఎం నాగమల్లేశ్వరరావు, మైన్స్ జీఎం కల్యాణచక్రవర్తి వివిధ పరిశ్రమల సిబ్బంది పెద్దఎత్తున పాల్గొన్నారు.