Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్
విద్యార్థి దశలో క్రీడలు ఒక భాగమని, అవి చాలా ముఖ్యమైనవని మున్సిపల్ వైస్‌చైర్మెన్ జక్కుల నాగేశ్వరరావు అన్నారు.ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ హైస్కూల్లో త్వైకాండో పరీక్షలు నిర్వహించారు.ఈ పరీక్షలలో వివిధ కలర్ బెల్టులు సాధించిన విద్యార్థులకు ఆయన సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల వల్ల విద్యార్థులు చురుకుగా ఉండడమే కాకుండా శారీరక,మానసికపరంగా ఆరోగ్య వంతులుగా ఉంటారన్నారు.పాఠశాలలో ఉపాధ్యాయులు, ఇంటి వద్ద తల్లిదండ్రులు కూడా విద్యార్థులను ఆటలలో ప్రోత్సహించాలన్నారు.పోటీలను ప్రోత్సహిస్తున్న అసోసియేషన్ వారిని ఆయన అభినందించారు .ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేషన్ కార్యదర్శి అంబేద్కర్, పీఈటీ సునీల్‌కుమార్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.