Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిలుకూరు
దేశంలో పేదరికం నిర్మూలించబడాలంటే పేదలందరికీ భూమి పంపిణీ చేసినప్పుడే పేదరిక నిర్మూలన సాధ్యమని వ్యవసాయ కార్మిక సంఘం అఖిలభారత కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు అన్నారు. ఆదివారం మండ కేంద్రంలోని వెంకటేశ్వర ఫంక్షన్హాల్లో జరిగిన ఆ సంఘం చిలుకూరు మండల ఆరవ మహాసభనుద్దేశించి ఆయన మాట్లాడారు.దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు దాటినప్పటికీ నేటి వరకు పేదరికం నిర్మూలించబడలేదన్నారు.దీనికి ప్రధాన కారణం పాలకవర్గాలు అనుసరించిన విధానాలే ప్రధాన మార్గాలన్నారు. దేశంలో లక్షలాది ఎకరాల భూములు భూస్వాములు పెట్టుబడిదారులు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అక్రమంగా ఆక్రమించుకొని అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం భూ పంపిణీకి సిద్ధం కాకపోతే రానున్న కాలంలో ఎర్రజెండా నాయకత్వాన భూ పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు .కేంద్రంలో అధికారంలోకొచ్చిన నరేంద్రమోడీ సర్కార్ గడిచిన ఎనిమిదేండ్ల కాలంలో ఉపాధిహామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి బడ్జెట్లో కుదించి చట్టాన్ని రద్దు చేయాలని ప్రయత్నం చేస్తున్నారన్నారు.అంతకుముందు వ్యవసాయకార్మికసంఘం మండల అధ్యక్షులుగా మైలార్ శెట్టి లింగయ్య ప్రధాన కార్యదర్శిగా నారసాని వెంకటేశ్వర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయకార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు వెలిది పద్మావతి,సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు వేనేపల్లి వెంకటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు నారసాని వెంకటేశ్వర్లు,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఆరే రామకృష్ణారెడ్డి,సీపీఐ(ఎం) మండల కార్యదర్శి నాగాటి చిన్నరాములు, రైతుసంఘం మండల నాయకులు బుడిగం రామారావు, గట్టు లింగయ్య, మైలార్శెట్టి లింగయ్య, కొండాపురం ఉపసర్పంచ్ యాదాల వీరస్వామి ,డీవైఎఫ్ఐ నాయకులు గద్దపాటికిరణ్, గద్దపాటి నాగమణి, పిల్లి వీరమల్లు పాల్గొన్నారు.