Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
నేరేడుచర్ల మండలకేంద్రంలో ఈనెల 20, 21వ తేదీల్లో నిర్వహించే సూర్యాపేట జిల్లా టీఎస్‌యూటీఎఫ్ నాల్గో జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పి.శ్రీనివాస్‌రెడ్డి,జిల్లా కార్యదర్శి ఎన్.నాగేశ్వరరావు అన్నారు.ఆదివారం పట్టణం లోని బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా మహాసభల కరపత్రాలను వారు విడుదల చేసి మాట్లాడారు. జిల్లా మహాసభలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవిలు హాజరవుతున్నట్టు తెలిపారు.జిల్లా మహాసభల్లో మొదటిరోజు నూతన విద్యా విధానంపై విద్యా సదస్సు, రెండవ రోజు జిల్లా కమిటీ ఎన్నిక ఉంటుందని తెలిపారు. కోదాడ డివిజన్ వ్యాప్తంగా యూటీఎఫ్ బాధ్యులు తరలిరావాలన్నారు.ఈ కార్యక్రమంలో పౌర స్పందన వేదిక జిల్లా అధ్యక్షులు ఆర్.ధనమూర్తి, జిల్లా కార్యదర్శి శ్రీదేవి, మండలాల బాధ్యులు పిచ్చయ్య, శ్రీనివాస్,విక్రంరెడ్డి ,బాలరాజు, దస్తగిరి, శ్రీనివాస్ మండవ ఉపేందర్ ,ఆంజనేయులు మోతిలాల్,శ్రీనివాస్, రామకృష్ణారెడ్డి, సైదులు, సీనియర్ నాయకులు చందా శ్రీనివాసరావు డోర్నీసు భావసింగ్, కిషోర్, హనుమయ్య, హమీద్, నర్సిరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.