Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస జిల్లా ప్రధానకార్యదర్శి నర్సింహ
నవతెలంగాణ-ఆలేరురూరల్
వ్యవసాయ కార్మికులకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్మికులకు కనీస కూలి రోజుకు రూ.600 ఇవ్వాలని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్ట పరిరక్షణ కోసం కార్మికులంతా ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ పిలుపునిచ్చారు.ఆదివారం మండలంలోని గుండ్లగూడెం గ్రామంలో పదోమహాసభ కేబీఆర్ ఫంక్షన్హాల్లో బొమ్మగంటి లక్ష్మీనారాయణ, జాలపు లక్ష్మీ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రోజురోజుకు పెరుగుతున్న ధరలతో వ్యవసాయ కూలీ కుటుంబాలు పేదలు తమ కుటుంబాలను పోషించుకోవడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.నేటికీ విద్య వైద్యం ఉపాధి పేదలకు అందుబాటులో లేదని ఆవేదన వెలిబుచ్చారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస రోజు కూలి 600 రూపాయలు నిర్ణయించి ఇవ్వాలని సూచించారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం రెండవ సారీ అధికారంలోకొచ్చిన తర్వాత వామపక్షాల పోరాట ఫలితంగా వచ్చిన తర్వాత 1958 లోని అటవీహక్కుల చట్టాన్ని సవరణ చేయడానికి సిద్ధపడిందని అదే జరిగితే దేశంలో ఉన్న అడవులు మొత్తం బహుళజాతి కార్పోరేట్ కంపెనీలకు అప్పగించడం ఖాయమన్నారు.ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అడవుల పెంపకం చేస్తామనడం అసలు దేశం అడవుల్లో ఉన్న సహజ వనరులను కార్పొరేట్శక్తులకు దారాదత్తం చేయడమేనన్నారు.అనంతరం నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు దూపటి వెంకటేష్, వ్యవసాయ కార్మిక సంఘం మండల ప్రధానకార్యదర్శి జూకంటి పౌలు, జిల్లా కమిటీ సభ్యురాలు కేతావతు లక్ష్మీ,నాయకులు అందే అంజయ్య, గ్యార అండాలు,ఎలగందుల రాములు, పారుపల్లి సత్యనారాయణ, మధ్యపోయిన ఉప్పలయ్య,కొయ్య రమ్య గ్యార విజయలక్ష్మీ, బానోతు కలమ్మ, చౌడబోయిన స్వప్న, యాదగిరి,సుధాకర్, భిక్షపతి, సామిల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.