Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రామన్నపేట
చేనేత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రచ్చ యాదగిరి, కార్మికులు సురపల్లి చంద్రమోహన్, పాండరిలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి, చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జల్థిరాములు డిమాండ్ చేశారు.ఆదివారం మండలకేంద్రంలో దాడిలో గాయపడ్డ వారిని పరామర్శించారు.అనంతరం వారు మాట్లాడుతూ పార్టీ రామన్నపేటమండల కార్యవర్గ సభ్యులు, చేనేత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రచ్చ యాదగిరి, కార్మికులు సురాపల్లి చంద్రమోహన్, పాండరిలపై దాడి చేసిన వారు ఎంతటివారైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు.దాడి చేసిన వారిని అరెస్టు చేసి రిమాండ్ చేసేంత వరకు చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగిస్తామని వారన్నారు.ఎంతో మందిని వేధించిన వనం సుధాకర్, వనం చంద్రశేఖర్, వనం నర్సింహాపై అధికారులు సుమోటోగా తీసుకొని సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో చేనేత సంఘం జిల్లా నాయకులు ఎలగందుల అంజయ్య, సీపీఐ మండల సహాయ కార్యదర్శి ఎర్ర రమేష్, ఏఐఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు మహేష్, నాయకులు శివరాత్రి సమ్మయ్య, బాలగోని మల్లయ్య, గంగాపురం వెంకటయ్య, భగవంత, వీరమళ్ళ ముత్తయ్య, మల్లేష్ చేనేత సంఘం నాయకులు సంగిశెటట్టి సుదర్శన్, దొంత సత్తయ్య, దొంత నాగరాజు, సూరపల్లి యాదగిరి, పొట్టబత్తిని రమేష్, తొర్ర ముత్తయ్య, సూరపల్లి చంద్రమోహన్, దొంత నాగభూషణం, కైరంకొండ నాగభూషణం, దొంత శ్రీరాములు, సూరపల్లి జగన్ మ్షెహన్, దొంత నరేష్, గంగుల మురళి, రచ్చ ఆనంద్, జెల్ల లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.