Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
నేటి బాలలే రేపటి పౌరులు అని మున్సిపల్ చైర్మెన్ వెన్‌రెడ్డి రాజు అన్నారు. చౌటుప్పల్‌లో నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక గ్రంథాలయంలో నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మెన్ ఉడుగు మల్లేశ్‌గౌడ్, డైరెక్టర్లు గోశిక రవి, బొబ్బిళ్ల శ్రీనివాస్, ఇబ్రహీమ్, సిలివేరు కృష్ణ, ఎమ్‌డి.ఖలీల్ తడక చంద్రకిరణ్, ఎమ్‌డి.రహీమ్, అటెండర్ అనిత పాల్గొన్నారు.
భూదాన్‌పోచంపల్లి : చిల్డ్రన్స్ డే ను ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలోబాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సోమవారం స్థానిక శాంతినికేతన్ పాఠశాలలో విద్యార్థులు నెహ్రు వేషధారణతో పాటు పాటలతో పాటు స్పీచ్‌లు సంస్కృతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు బడిలో నేర్చుకున్న చదివే విద్యార్థులకు ముందు భవిష్యత్తుకు మార్గదర్శకమ వుతాయన్నారు .అనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎడ్ల తిరుమలరెడ్డి ,లలిత, శ్యామల, చిలువేరుసుధా, సునీత రవళి, శారద, సుధా ,సంతోష ,అంకిత,సంధ్య పాల్గొన్నారు.
భువనగిరి : పట్టణంలోని జీనియస్ హైస్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఎస్. సత్యనారాయణ మాట్లాడుతూ చాచా నెహ్రూ .. పిల్లలను అమితంగా ఇష్టపడే భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మించిన నవంబర్ 14 వ తేదీన బాలల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మెన్ పడాల శ్రీనివాస్, కరస్పాండెంట్ బొజ్జ సూర్యనారాయణ రెడ్డి ,డైరెక్టర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ బాలల దినోత్సవం సందర్బంగా భువనగిరి న్యాయ సేవా అధికార సమితి, పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల సంయుక్త ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు మాట్లాడుతూ బాల బాలికల విజ్ఞానం, సంస్కతి, భవితవ్యం మన దేశ సంపద అని తెలిపారు. భువనగిరి న్యాయ సేవా సమితి నిర్వహించిన వ్యాస రచన పోటీలో నైపుణ్యం కనబర్చిన విద్యార్థినులు సదాఫ్ ఫాతిమ, సి.హెచ్ చందన, ఆర్.అనూషలకు పుస్తక బహుమతులను అందచేసి విద్యార్థినులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పుస్తకాలను సంఘ సేవా కర్త, విశ్రాంత న్యాయ శాఖ ఉద్యోగి యం. బాలేశ్వర్ డొనేట్ చేసారు. కార్యాక్రమంలో బాలేశ్వర్ ,పాఠశాల ప్రధానోపాధ్యాయులు దామోదర్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
బొమ్మలరామరం : జవహర్ లాల్ నెహ్రూ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం మండలంలోని నలంద స్కూల్లో పాఠశాలలో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా,నెహ్రూ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
బీబీనగర్ : బాలల దినోత్సవ సందర్భంగా సోమవారం నాడు మండల పరిధిలోని వెంకిర్యాల గ్రామంలో సాయి మోహిత్ మెమోరియల్ హైస్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. పాఠశాల డైరెక్టర్ డి బ్రహ్మం విద్యార్థులను అభినందించి వారికి స్వీట్లు పంపిణీ చేసినారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం బి స్వరూప, హెల్త్ అసిస్టెంట్ కె భాస్కర్, ఆశా వర్కర్లు, సుజాత, ఉమారాణి, సుజాత,రాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
అడ్డగుడూర్ : మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలతో పాటు, మండలంలోని గోవిందపురం సెంట్ విన్సెంట్ పల్లోటి ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులకు స్వీట్లు,పండ్లు పంపిణీ చేశారు. తుంగతుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది అన్నేపర్తి జ్ఞాన సుందర్ విద్యార్థులకు నోట్ బుక్స్ నిమిత్తంరూ. 2వేలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు లక్ష్మీదేవి కాలువ గ్రామ సర్పంచి నారగోన అంజయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గూడెపు పాండు వల్లంబట్ల రవీందర్రావు,బాలెంల సురేష్,బొమ్మగాని లక్ష్మయ్య,బిసి సెల్ మండల అధ్యక్షుడు బండి మధు, మల్లేష్ పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
ఆలేరుటౌన్ : మండల కేంద్రంలో సోమవారం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నతపాఠశాల ,ప్రాథమిక ఉన్నత పాఠశాలలు, ఏకశిలా, ప్రగతి, శ్రీరామకృష్ణ, జేఎంజే, ఎవరెస్టు పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. బాలల ఔన్యత్యాన్ని వివరిస్తూ ఉపాధ్యాయులు ప్రసంగించారు. నేటి బాలలే రేపటి పౌరులని పేర్కొన్నారు. బాలలతో భారతదేశ బంగారు భవిష్యత్ ముడిపడి ఉందన్నారు .ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎస్. సుర్యనారాయణ ,బండి రాజుల శంకర్ , ఇందిరా , జయ భార్గవి ,ప్రభాకర్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.