Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్
నవతెలంగాణ-చౌటుప్పల్
గొల్ల కురుమల అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. సోమవారం మున్సిపల్ కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఓడిపోయినా గొల్ల కురుమలకు నిధులు ఇవ్వక ఆపేశారని చెబుతూ దొంగ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. మునుగోడు నియోజకవర్గంలో 7600 మంది గొల్ల కురుమల అకౌంట్లో డబ్బులు పడ్డాయన్నారు. రాజగోపాల్‌రెడ్డి, బీజేపీ నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతోనే డబ్బులు రాకుండా నిలిపివేశారన్నారు. గొల్ల కురుమలకు డబ్బులు రాకుండా నిలిపివేసే విధంగా చేసి పైగా ధర్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. దేశంలో ఎక్కడా కూడా గొల్ల కురుమలకు పథకాలు లేవన్నారు. పింఛన్లు, ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతు భీమా, రుణమాఫీ, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ లాంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మునుగోడులో మిషన్ భగీరథ ద్వారా ఫ్లోరోసిస్‌ను పారదోలిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. గొల్ల కురుమలకు అన్యాయం చేసింది బీజేపీ అని విమర్శించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్ ఆలె నాగరాజు, నాయకులు అయోధ్యయాదవ్, చిన్నం బాలరాజు, నల్ల గణేశ్‌యాదవ్ పాల్గొన్నారు.