Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకించండి
- ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ- ఆలేరుటౌన్
విద్యా నూతన విధానాన్ని మేధస్సును కార్పొరేట్లకు తాకట్టుపెట్టే విద్యావిధానాన్ని దేశ మేధావులంతా ముక్తకంఠంతో వ్యతిరేకించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలో పద్మావతి గార్డెన్స్ లో ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో జాతీయ నూతన విద్యా విధానం పర్యావసనాలు అనే అంశంపై ఆ సంఘం మండల కార్యదర్శి కాసుల నరేష్ అధ్యక్షతన సెమినార్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుకొని దేశ అభివద్ధిలో భాగస్వామ్యమయ్యేవిధంగా విద్యారంగాన్ని అమలు పరచాలన్నారు. ఈ విద్యా విధానం వల్ల పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఉందని పేర్కొన్నారు . తరగతి గదిలో అసమానతలు లేని విద్యను ప్రభుత్వాలు ఏర్పరచాలని అన్నారు. నూతన విద్యా విధానం వల్ల విద్యార్థుల్లో మతతత్వ భావజాల నింపటానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పండుతున్నదన్నారు. విద్యాసంస్థల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి తరగతి గదిని కలుషితం చేయటానికి ఈ విద్యా విధానం దోహదపడుతుందన్నారు. పేద విద్యార్థులను చదివించి దేశ అభివద్ధిలో వారి మేధస్సును భాగస్వామ్యం చేయాల్సిన ప్రభుత్వమే విద్యార్థుల ఐక్యతను దెబ్బతీసే విధంగా తీసుకొచ్చిందన్నారు. రాజ్యాంగ లక్ష్యాలకు అనుకూలంగా విద్యా విధానాన్ని ఏర్పాటు చేయకుండా వారి ఇష్టారాజ్యంగా అమలు చేయాలని చూస్తున్నారన్నారు. విద్యార్థుల్లో ఆర్థిక, అసమానతలు ఏర్పడే అవకాశముందన్నారు. జాతీయ విద్యా విధానాన్ని బలవంతంగా విద్యార్థుల్లోకి తీసుకురావడం అంటే పేద విద్యార్థులను చదువుకు దూరం చేయడమే అని అన్నారు. దేశంలో విద్యా వ్యవస్థను తమకు అనుకూలంగా మార్చుకొని దేశంలో ప్రశ్నించే వారసత్వ సంపద లేకుండా చేయడంకోసమే బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని వారన్నారు. విద్యార్థులంతా ఈ నూతన జాతీయ విద్యా విధానంను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. . కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముక్కెర్ల యాదయ్య , మెతుకు సైదులు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బుర్రు అనిల్, వనం రాజు, ఆవాస్ జిల్లా అధ్యక్షులు ఎంఎ ఇక్బాల్, మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు దూపటి వెంకటేష్ ,దాసి శంకర్ ,ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు కందుల నాగరాజు ,మండల ఉపాధ్యక్షులు కంతి విక్రమ్, సాయినీ కళ్యాణ్ ,డివైఎఫ్ఐ పట్టణ నాయకులు బోనగిరి గణేష్ ,ఎస్ఎఫ్ఐ నాయకులు పాసికంటి ఉదయ్ ,అదే సూర్జిత్ ,ఎంబడి సాయి ,కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.