Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధాన్యం, పత్తి కొనుగోళ్లలో దళారుల నిలువు దోపిడీ తూకాల్లో మోసం
అప్పో సప్పో చేసి ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకుందామంటే దళారులు రాబందు లాగా గ్రామాల్లో వాలుతున్నారు. తూకంలో మోసం ధరలో కోత పెడుతూ జోరుగా జీరో దందా కొనసాగిస్తున్నారు. రైతులకు మద్దతు ధర కల్పించి ఆదుకోవాల్సిన అధికారులు పట్టించుకోవడంలేదని పట్టించుకోవడంలేదు. లైసెన్స్లేకుండా జీరోవ్యాపారం చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ, తూకాల్లో మోసం చేస్తూ రైతులను నట్టేట ముంచుతున్నారు.
నవతెలంగాణ- ఆలేరు రూరల్
ఆలేరు మండలంలోని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం వానాకాలంలో 4059 ఎకరాల్లో పత్తి పంట, 11165 ఎకరాల్లో వరి సాగు చేశారు.గ్రామాల్లో దళారులు ఇల్లుల్లు తిరుగుతూ వరి పంట కోసిన మొదలుకొని ఎప్పుడు ధాన్యం అమ్ముతామని వెంటపడి ధాన్యం విక్రయించే విధంగా మాయమాటలు చెపుతూ రైతు దళారికి అమ్మే విధంగా చేస్తాడు. కాంటా వేసి బస్తాకు రెండు కిలోలు కట్ చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.2060 ఉండగా రూ.1700 కొనుగోలు చేస్తున్నారు.
పత్తిదళారులు ఇంటింటికి తిరుగుతూ పత్తిని కొనుగోలు చేస్తున్నారు. పత్తి కొనే దళారులు పార్టీల వారీగా ఉంటున్నారు. ఏ పార్టీ వారు వారే పత్తినే కొంటున్నారు. ప్రభుత్వం ప్రకటించిన క్వింటా రూ. 6380 ఉంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో అకాల వర్షాల వల్ల పత్తి పంట భారీగా నష్టం వాటిల్లింది.పత్తి క్వింటాకు రెండు కిలోలు కట్ చేస్తున్నారు. ఆరు క్వింటాలు అయ్యే పత్తి ఐదు క్వింటాళ్లు వచ్చే విధంగా మిషన్ తయారు చేస్తున్నారు. క్వింటా రూ.6600-6700 కొనుగోలు చేస్తున్నారు. అదనంగా డబ్బులు వస్తుండడంతో రైతులు ఆశపడి దళారులకు అమ్ముకుంటున్నారు. దొంగతూకాలు వేయడంతో 6క్వింటాలు కావాల్సిన పత్తి 5క్వింటాలే అవుతుంది. దీంతో రైతులు నట్టేట మునుగుతున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గ్రామాల్లో లైసెన్స్లేకుండా జీరో వ్యాపారం చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న దళారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
దళారులపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలి
సీపీఐ(ఎం) మండల కార్యదర్శి వెంకటేశ్
కలెక్టర్ ప్రత్యేక దృష్టి సాధించి దళారి వ్యవస్థను అరికట్టాలి. రైతులకు తూకంలో ధరలో మోసం చేసిన వారిపై కఠిన చర్య తీసుకోవాలి.పత్తి పంటను మార్కెట్లోని కొనే విధంగా చూడాలి.
వరి ,పత్తి పంట నష్టం జరిగింది
రైతు కారే రాజు శర్బనాపురం
వరి రెండు ఎకరాల వరకు 45 బస్తాలు మాత్రమే పంట దిగుబడి వచ్చింది. డబ్బులు అవసరం ఉండడంతో దళారీని ఆశ్రయించాను. క్వింటా 1700 చొప్పున తీసుకున్నాడు. పెట్టిన పెట్టుబడి కూడా సరిగ్గా రాలేదు. పత్తి పంట కూడా నష్టం జరిగింది.