Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఒకే మతం...ఒకే కులం..ఒకే విధానం..డబుల్ ఇంజన్ సర్కారు పేరుతో బీజేపీ పాలన సాగిస్తుందని, తమ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలను, నాయకులను బెదిరిస్తూ తమ వైపు తిప్పుకొనేందుకు కుట్రలు చేస్తున్నారని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండలోని ఎఫ్సీఐ కమ్యునిటీ హల్ల్లో జరిగిన సీపీఐ(ఎం) జిల్లా విస్తృత సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ ఆస్తులను అమ్మి కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం మోడీ చేస్తున్నాడన్నారు. స్నేహంగా ఉంటూనే తెలంగాణ ప్రభుత్వాన్ని కులగొట్టేందుకు కుట్రలు చేశారని, దాన్ని గ్రహించి కేసీఆర్ తెరుకున్నరని చెప్పారు. దేశం మీద కాలకిడ్ పడి దేశాన్ని దోచుకునేందుకు చూస్తున్నారన్నారు. అలాంటి బీజేపీకి రాష్ట్రంలో చోటుకు అవకాశం ఇవ్వకూడదని చెప్పారు. మునుగోడు ఉపఎన్నికల్లో కమ్యూనిస్టులు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని ప్రజలు సమర్దిస్తున్నారని గుర్తుచేశారు. బీజేపీని రాకుండా వెనెక్కి తరిమికొట్టేందుకు భవిష్యతులో కలిసి పని చేయాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో కమ్యూనిస్టులు బలపడుతున్నారని చెప్పారు. ఎన్నికల ముందు కేసీఆర్ను కలిసి 24 డిమాండ్లు ఉంచి వాటిని అమలు పర్చమన్నారు. పార్టీ బలోపేతంకు కార్యకర్తలు నడుం బిగించాలని కోరారు. స్థానిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. బాధ్యతగా పని చేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు.