Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఈ నెల 27 నుంచి 29 తేదీ వరకు నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగే రైతు సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్ పిలుపునిచ్చారు. సోమవారం నల్లగొండలో నిర్వహించిన సీపీఐ(ఎం) జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మహాసభలకు ముందు రోజు 27 వ తేదీన భారీ ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 28, 29 తేదీలలో ప్రతినిధుల సభ ఉంటుందని చెప్పారు. మొదటి రోజు 27న జరిగే బహిరంగ సభకు ఆలిండియా నాయకులు యోగేంద్ర, దనన్ మొల్ల, డాక్టర్ అశోక్ దవుల్యా హాజరౌతున్నారని తెలిపారు. ప్రతి గ్రామం నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చే విధంగా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. అన్ని గ్రామాలలో గోడ రాతలు రాయాలని, సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేయాలని కోరారు. అన్ని ప్రజా సంఘాల నాయకులు బాధ్యతగా ప్రచారం చేసి మహాసభల విజయవంతంకు కృషి చేయాలని కోరారు.
27,28,29 తేదీలలో రైతు సంఘం మహాసభలు
ఈ నెల 27, 28, 29 తేదీలలో రైతు సంఘం రాష్ట్ర మహాసభలు నల్లగొండలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 27 న మహా ప్రదర్శన, భారీ బహిరంగ సభ ఉంటుందని చెప్పారు. నాయకులు, కార్యకర్తలు నేరుగా రైతు కుటుంబాలను కలిసి రైతు మహాసభల గురించి వివరించాలని కోరారు. బహిరంగ సభకు వేలాది మందిని తరలించాలని పిలుపునిచ్చారు. 28, 29 తేదీలలో ప్రతినిధుల సభ జరుగుతుందని, ఇందులో రైతు ఎదుకుంటున్న సమస్యలను చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించనునట్టు తెలిపారు. ఈ మహాసభలలో ఆలిండియా రైతు నాయకులు హాజరౌతున్నారని తెలిపారు. ఈ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి సాగర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బొంతల చంద్రారెడ్డి, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, డబ్బికార్ మల్లేష్, పాలడుగు నాగార్జున, పాలడుగు ప్రభావతి, కందాల ప్రమీల, రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, కూన్‌రెడ్డి నాగిరెడ్డి, ఎండి.హశాం, సూర్యాపేట రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.