Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి
నవతెలంగాణ -సూర్యాపేటకలెక్టరేట్
కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యాన్ని జల్లెడ పట్టిన తర్వాతనే కాంట వేయాలనేనిబంధనను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .సోమవారం తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సూర్యాపేట ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మూలంగా రైతులపై అదనపు భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి నిబంధనలు లేకుండా రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కందాల శంకర్ రెడ్డి ,జిల్లా సహాయ కార్యదర్శి మందడి రామ్ రెడ్డి, నాయకులు కే లక్ష్మారెడ్డి ,వెంకట్ రెడ్డి, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.