Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -రామన్నపేట
మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన విద్యార్థులు విద్యకు దూరమయ్యే విధంగా ఆర్టీసీ అధికారులు వ్యవహరించడం తగదని ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్ష, కార్యదర్శులు మేకల జలెందర్, బండ్ల పవణ్ అన్నారు. ఆ సంఘం ఆద్వర్యంలో సోమవారం స్థానిక తహసీల్థార్ కార్యాలయం ఎదుట విద్యార్థులు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్థార్ వలిగొండ ఆంజనేయులుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామన్నపేట మండలంలో అమ్మనబోలు, కక్కిరేణి, వేములకొండ, వెల్లంకి రూటు గ్రామాల నుంచి సుమారుగా 500 మంది విద్యార్థులు మండల కేంద్రం, జిల్లా కేంద్రాల్లోని వివిధ ప్రాంతాల్లో విద్యను అభ్యసిస్తున్నారు. బస్సులు నడవకపోవడంతో విద్యార్థులు ఆర్థిక భారంతో చదువుకు దూరం కావాల్సివస్తుందన్నారు. వెంటనే బస్సులను పునరుద్దరించాలని డిమాండ్ ఏశారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఐ నాయకులు బెల్లం కొండా ఉదరు, కంబాలపల్లి మహేష్ కళ్లెం గోవర్ధన్, పండుగ శివశంకర్, రజాక్, తదితరులు పాల్గొన్నారు.