Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ-నూతనకల్
సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు తోనుకునూరి రాములు ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని వెంకిపల్లి గ్రామంలో గ్రామ శాఖ కార్యదర్శి బత్తుల జనార్దన్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన తొనుకునూరి రాములు సంతాప సభకు ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో గ్రామానికి ఎంతో చరిత్ర ఉందని అలాంటి అమరవీరుల ఆశయ సాధన కోసం నేటి యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీని బలోపేతం చేయడంలో ఆయన కృషి మరువలేనిదన్నారు. ఎన్ని ఆటుపోట్లు వచ్చినప్పటికీ కడదాకా సిపిఎం పార్టీలో కొనసాగిన మహా యోధుడని కొనియాడారు. గ్రామంలో వార్డు సభ్యుడిగా ఎన్నికై గ్రామ అభివృద్ధికి విశేష కృషి చేశారన్నారు. పేదరికం, ఆర్థిక అసమానతలు ఉన్నంతకాలం కమ్యూనిజం ఉంటుందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్టులు నిర్వహించిన పాత్ర మరువలేనిన్నారు. అంతకుముందు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బుర్ర శ్రీనివాస్ ,కందాల శంకర్ రెడ్డి, మట్టి పెళ్లి సైదులు, రైతు సంఘం నాయకులు పళ్ళ సుదర్శన్, సిపిఎం మండల కమిటీ సభ్యులు తొట్ల లింగయ్య ,కూసు సైదులు, బొజ్జ శ్రీనివాస్ ,బత్తుల సోమయ్య ,దూది గాని ఎల్లయ్య, బత్తుల సాయిలు, తొనుకునూరి సైదులు ,దూది గాని వెంకటయ్య, మల్లయ్య, చంద్రయ్య ,బత్తుల బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.