Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం మహిళా రైతుల రాష్ట్ర కన్వీనర్ కందాల ప్రమీల
నవతెలంగాణ-నకిరేకల్
స్వాతంత్య్ర సమరయోధుడు విప్లవకారుడు బిర్సాముండా ఆశయ సాధన కోసం రైతాంగం నడుము బిగించాలని తెలంగాణ రైతు సంఘం మహిళా రైతుల రాష్ట్ర కన్వీనర్ కందాల ప్రమీల పిలుపునిచ్చారు. మంగళవారం మండల పరిధిలో బీర్సాముండా జయంతి సందర్భంగా రైతు సంఘం జెండాను ఆమె ఆవిష్కరించి మాట్లాడుతూ బ్రిటీష్కు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఆదివాసీ వీరున్ని సంస్మరణ దినోత్సవం సందర్భంగా లక్షకు పైగా గ్రామాల్లో ఎర్ర జెండాలు ఎగురవేయాలనే ఉద్దేశంతో జండావిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చోటా నాగపూర్ గ్రామంలో ప్రజలను రైతాంగాన్ని సమీకరించి భూస్వాములకు వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు నిర్వహించారన్నారు. ఆయన స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రైతాంగం ప్రజా ఉద్యమాలలో ముందు పీఠాన నిలవాలని ఆకాంక్షించారు. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకువచ్చి రైతుల మనుగడకే నష్టం కలిగించే చర్యలకు పాల్పడ్డారని చైతన్యవంతమైన రైతులు ఏడాది పాటు పోరాడి రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేసేంతవరకు పోరాడారని అన్నారు. రైతు పండించిన పంటకు మద్దతు ధర కల్పించి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు చలకాని మల్లయ్య, మండల అధ్యక్ష కార్యదర్శులు సైధుల శీను ,నూనె గట్టయ్య, నాయకులు కల్లూరి లింగయ్య ,గుండ్ల పల్లీ వెంకన్న, బల్లెం వెంకన్న, బట్ట లింగ ప్రసాద్, కల్లూరి అంజయ్య ,చాలకని పరామేష్ ,అంజయ్య ,ప్రవీణ్ ,తదితరులు పాల్గొన్నారు.