Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భూదాన్ పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లా మున్సిపల్ కార్మికుల మూడవ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి దాసరి పాండు అన్నారు .మంగళవారం పట్టణ కేంద్రంలో మున్సిపల్ కార్మికులతో మాట్లాడుతూ ఈనెల 16వ తేదీన భువనగిరి పట్టణ కేంద్రంలో సుందరయ్య భవన్ లో జరిగే జిల్లా మూడవ మహాసభలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారికి కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ మంచాల మధు నాయకులు కుక్క నరేష్ భాస్కర్ జంగయ్య పాల్గొన్నారు.