Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- మునుగోడు
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంను మంగళవారం కిష్టాపురం ఎంపీటీసీ భీములపల్లి సైదులు పరిశీలించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తే విద్యార్థులు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంజిరెడ్డి , ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.