Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖాతాలో పడ్డ డబ్బులు వారివే
- గొల్ల కురుమలకు కేసీఆర్ అండ
నవతెలంగాణ -నల్లగొండ
మునుగోడు ఉప ఎన్నికల్లో ఘోర పరాభవం చవి చూసిన బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గొల్ల కురుమల పట్ల చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని గొల్ల కురుమలు ఎవరు నమ్మొద్దని గొర్రెలు మేకలు అభివద్ధి సమాఖ్య రాష్ట్ర చైర్మెన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.యాదవుల గొల్ల కురుమల కుటుంబాలు ఆర్థికంగా పరపుష్టి కావాలని ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు గొల్ల కురుమలకు3.94 లక్షల మంది లబ్దిదారులకు రూ.5001.53 కోట్లతో82.74 లక్షల గొర్రెలను అందజేసినట్టుతెలిపారు. రెండో విడత గొర్రెల పంపిణీలో భాగంగా ఇప్పటివరకు3.50 లక్షల మంది లబ్ధిదారులకు73.50 లక్షల గొర్రెలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దీనికోసం 6 వేల125 కోట్లను పంపిణీకి సిద్ధం చేసినట్లు వివరించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఉద్దేశంతోనే బీజేపీ నాయకులు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడంతోనే లబ్దిదారుల ఎకౌంట్లో ఉన్న నగదును పేజ్ చేశారని తెలిపారు. గొల్ల కురుమలకు ఎవరి ఖాతాలో ఉన్న డబ్బులు వారి ఖాతాలోనే ఉంటాయని ఎవరు ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి దురుద్దేశంతోనే గొల్ల కురుమలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు. గొల్ల కురుమల ఓట్లను బీజేపీ వైపు మార్చుకునేందుకే రాజగోపాల్ రెడ్డి మునుగోడులో ధర్నా చేశారని ఆరోపించారు. సమావేశంలో కౌన్సిలర్లు గోగుల శ్రీనివాస్ యాదవ్, ఎడ్ల శ్రీనివాస్ యాదవ్, టిఆర్ఎస్ నాయకులు బకరం వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.