Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
నవతెలంగాణ- నల్లగొండ కలెక్టరేట్
నల్గొండ జిల్లా కేంద్రంలో ఒకరోజు, ఈ నెల 19 న లక్ష మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమాన్ని అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. మంగళవారం నల్గొండ మున్సిపల్ సమావేశ మందిరంలో మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డితో కలిసి జిల్లా కేంద్రంలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో లక్ష మొక్కలను నాటాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఓఎస్డీ ప్రియాంక వర్గిస్ హాజరవుతున్నట్టు తెలిపారు. పట్టణ శివారులోని ఎస్ఎల్బీసీ ప్రాంతంలో ఏర్పాట్లను చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. లక్ష మొక్కలను నాటాలని ఇందుకుగాను 10 మంది స్పెషల్ ఆఫీసర్లను, 17 మంది సూపర్వైజర్ అధికారులను నియమించినట్టు తెలిపారు. అంతేకాకుండా మరో 70 మంది అధికారులను అదనంగా వినియోగిస్తున్నట్టు వివరించారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మెన్ అబ్బగోని రమేష్, కమిషనర్ డాక్టర్ కె.వి రమణాచారి, జిల్లా పరిషత్ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా ఫారెస్ట్ అధికారి రాంబాబు, జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి, మహిళా సంక్షేమ శాఖ అధికారి సుభద్ర, సీడీపీిఓ నిర్మల ,ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ సల్మా భాను, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్ పుష్పలత, పర్యావరణ అధికారి సురేష్ బాబు, ఉద్యానవన శాఖ అధికారి సంగీతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
రెండవ రోజు కొనసాగిన వేలం
నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డి గూడ గ్రామంలో రాజీవ్ స్వగృహ శ్రీ వల్లి టౌన్ షిప్ ఓపెన్ ప్లాట్ లకు, పాక్షిక నిర్మాణ గృహాలకు రెండో రోజు ప్రత్యక్షం వేలం నిర్వహించారు.మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఉద యాధిత్య భవన్ లో నిర్వహించిన ప్రత్యక్ష వేలం లో ప్రభుత్వానికి రూ.55 లక్షల ఆదాయం వచ్చింది. ప్రభుత్వం ద్వారా రోడ్లు,పార్క్ లు అభివృద్ది చేయనున్న శ్రీ వల్లి టౌన్ షిప్ లో చిక్కులు లేని ప్లాట్ ల ను ఈ నెల 17 వరకు నిర్వహించనున్న వేలం లో పాల్గొని సొంతం చేసుకోవాలని ఉద్యోగులు,ప్రజలకు కలెక్టర్ సూచించారు.నార్కట్ పల్లి ఎల్లారెడ్డి గూడ గ్రామం లోని రాజీవ్ స్వగృహ శ్రీ వల్లి టౌన్ షిప్ ఓపెన్ ప్లాట్ లు,పాక్షిక గృహ నిర్మాణం లను జిల్లా కలెక్టర్ టి.వినరు కృష్ణా రెడ్డి ,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖుషఉ్బ గుప్తా,జిల్లా అధికారులు క్షేత్ర సందర్శన చేశారు.ఓపెన్ ప్లాట్ లకు అప్ సెట్ ధర చదరపు గజం కు 6 వేల రూ,పాక్షిక నిర్మాణ గృహాలకు 10500 రూ, అప్ సెట్ ధర గా నిర్ణయించి నట్లు తెలిపారు.