Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -వలిగొండ రూరల్
గ్రామాల సమగ్రాభివృద్దే ప్రభుత్వ లక్ష్యం అని స్థానిక శాసన సభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు.మంగళవారం మండలంలోని టేకులసోమారం 25 లక్షల ఎస్డీఎఫ్ నిధులు,15 లక్షల సీడీపి నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్లు, అండర్ డ్రయినేజీ నిర్మాణపనులు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాలను అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి కెేసీిఆర్ ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చేగురి భిక్షపతి,ఎంపిటిసి చేగురి భారతమ్మ, గోపాల్, పడమటి మమత నరేందర్ రెడ్డి, తుమ్మల వెంకట్ రెడ్డి, నోముల మల్లేషం,మొగుళ్ల శ్రీనివాస్,డేగల పాండు, సోలిపురం సాగర్ రెడ్డి, తుమ్మల వెంకట్ రెడ్డి, ఎంపిడిఓ గీతారెడ్డి, తహసీల్దార్ గణేష్ నాయక్, పంచాయతీ రాజ్ ఏ ఈ సుగుణాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.