Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీడబ్ల్యూయూ రాష్ట్ర కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి
నవతెలంగాణ- వలిగొండ
బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిన భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన 1996 కేంద్ర చట్టం, 1998 సెస్ చట్టం, 1979 అంతర్రాష్ట్ర వలస కార్మిక చట్టాలను పునరుద్దరించాలని బీసీడబ్ల్యూయూ రాష్ట్ర కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కార్మికులకు రక్షణ, సంక్షేమం కోసం ఉన్న చట్టాలను రద్దు చేసి యాజమాన్యాలకు అనుకూలంగా లేబర్ కోడ్స్ తెచ్చి నిర్మాణ కార్మికులను కట్టు బానిసలుగా మార్చుతుందన్నారు. తక్షణమే రద్దు చేసిన చట్టాలను పునరుద్దరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిన 1005 కోట్ల రూపాయలను తిరిగి బోర్డులో జమచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి తుర్కపల్లి సురేందర్, బీసీడబ్ల్యూయూ రాష్ట్ర కమిటీ సభ్యులు రాధారపు మల్లేషం, మండల అధ్యక్షులు సింగారం వెంకటేషం, నాయకులు చీర నగేష్, శ్రీనివాస, తదితరులు పాల్గొన్నారు.