Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ- భువనగిరిరూరల్
ఆయిల్ పామ్ సాగుతో అధిక ఆదాయం పొందవచ్చని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మంగళవారం రైతు సాగు చేసిన ఆయిల్ఫామ్తోటలను ఆమె జిల్లా ఉద్యాన అధికారి అన్నపూర్ణతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉద్యాన పంటలలో ఆయిల్ పామ్ పంట చాలా ముఖ్యమైన పంట అని, ఈ పంట ద్వారా రైతుకు ఆదాయం కూడా ఎక్కువేనని, ఆయిల్ పామ్ సాగుకు అనువైన పరిస్థితులు జిల్లాలో ఉన్నాయని తెలిపారు. జిల్లాలో ఆయిల్ పామ్ విస్తీర్ణాన్ని పెంచే దిశగా ప్రభుత్వం టి ఏస్ అయిల్ ఫెడ్ అనే ఆయిల్ పామ్ కంపెనీని కేటాయించినట్టు తెలిపారు. జిల్లాలో 60 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ నర్సరీని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఆయిల్ పామ్ సాగు విస్తరణ ఇంపోర్టెడ్ ఆయిల్ పామ్ మొక్కలకు హెక్టారుకు 150 మొక్కలకు గాను ఒక్కో మొక్కకు రూ.193 చొప్పున రూ.29,000 రాయితీ ఇవ్వడం జరుగుతుందని, ఒక్కో మొక్కకు రైతు వాటా రూ.20 డి హెచ్ ఎస్ ఓ యాదాద్రి పేరు మీద డిడి రూపంలో చెల్లించాలని తెలిపారు. తోటల నిర్వహణకు మొదటి నాలుగేండ్లకుగాను హెక్టారుకు రూ.5250 రాయితీ కలదని తెలిపారు. అంతర పంటల సాగుకై మొదటి నాలుగు సంవత్సరాలకు గాను హెక్టారుకు రూ.5250 సంవత్సరానికి చొప్పున రాయితీ ఉందన్నారు. బిందు సేద్యంపై ఎస్సీ, ఎస్టీ రైతులకు 100, సన్న, చిన్నకారు రైతులకు 90, ఇతర రైతులకు 80 రాయితీ ఉందని , ఆసక్తి ఉన్న రైతులు సంబంధిత టీఎస్ ఆయిల్ఫడ్ సిబ్బంది సంప్రదించాలని కోరారు.