Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుంభం అనిల్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ- భూదాన్‌పోచంపల్లి
రైతులను నిలువు దోపిడీ చేస్తున్న రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డీసీసీి అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం పోచంపల్లి ఆయా మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకునానరు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో రైస్ మిల్లర్లు ప్రజాప్రతినిధులు కావడంతో ఏదో ఒక విధంగా ఇబ్బందుల పాలు చేస్తున్నారన్నారు. మిల్లర్లు క క్వింటాలుకు రెండు నుంచి మూడు కిలోలు ధాన్యాన్ని అదునంగా తూకం వేయడం వల్ల రైతు వేలాది రూపాయలునష్టపోతున్నారని అన్నారు. అన్ని మండలాల్లో 41 కేజీలు తూకం వేస్తుంటే పోచంపల్లి మండలంలో 41 కేజీల 600 తూకం వేయడం సరికాదన్నారు. క్వింటాకు సుమారు 50 నుండి 60 రూపాయలు నష్టపోతున్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే మిల్లర్స్ లతో మాట్లాడి రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాల న్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు .