Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేశ్
నవతెలంగాణ -ఆలేరుటౌన్
మతోన్మాదాన్ని ఎదిరించడానికి నేటి యువత ముందుకు రావాలని డీివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్, సహాయ కార్యదర్శి చెన్న రాజేష్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఏసీి రెడ్డి భవనంలో బోనగిరి గణేష్ అధ్యక్షతన నిర్వహించిన ఆ సంఘం పట్టణ జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతను మతం పేరుతో, హిందుత్వం పేరుతో రెచ్చగొడుతూ భవిష్యత్తును నాశనం చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఏటా కోట్ల ఉద్యోగాలు ఇప్పటివరకు భర్తీ చేసిన పరిస్థితి లేదన్నారు. యువతకు ఉపాధి మాట పక్కన పెట్టి మతోన్మాదాన్ని, కులోన్మాదాన్ని పెంచి పోషిస్తున్న బీజేపీ విధానాలను యువత ఎప్పటికప్పుడు ఎదిరించడం కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాటూరి బాలరాజు, ఆవాజ్ జిల్లా అధ్యక్షులు ఎంఏ ఇక్బాల్ నాయకులు వడ్డెమాను విప్లవ్, మాదాని నవీన్, మోరిగాడి మౌర్య, ఎండి అఖిల్, దండు నాగరాజు, పాశకంటి ఉదరు, గాడిపల్లి ప్రశాంత్, విద్యార్థి సంఘం నాయకులు కందుల నాగరాజు, కత్తి విక్రమ్ పాల్గొన్నారు.