Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నల్లగొండ కలెక్టరేట్
ఇకముందు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ ఫీజు చెల్లింపులు అన్ని ఆన్లైన్లోనేే జరగనున్నట్టు ఉపకులపతి ఆచార్య చొల్లేటి గోపాల్ రెడ్డి తెలిపారు. ఎంజియూ విద్యార్థుల ఫీజు చెల్లింపులపై గురువారం ఎస్బిఐ తో ఎంజియూ ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా విసి మాట్లాడుతూ నేటి డిజిటల్ యుగంలో ఈ ఆన్లైన్ సదుపాయాలు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. సమయము శ్రమతో పాటు ఆఫ్ లైన్ చెల్లింపుల్లో వ్యయాలను సైతం అధిగమించే అవకాశమున్నట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ రవీందర్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలు దేశ సమగ్రతను సమూలంగా మార్చగలిగే శక్తివంతమైనటువంటి దేవాలయాలుగా కీర్తించారు. విద్యార్థులను ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దడంతోపాటు దేశ సమగ్రాభివృద్ధికి విశ్వవిద్యాలయాలు పునాదులని ఆయన కీర్తించారు. వేగంగా మారుతున్న కాలమాన పరిస్థితులకు తగ్గట్టు బ్యాంకింగ్ సేవలు సైతం అందుబాటులోకి తెస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మా సేవలు విశ్వవిద్యాలయానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ ప్రతినిధులు డిప్యూటీ జనరల్ మేనేజర్ రవీందర్, ప్రశాంత్ కుమార్, రీజనల్ మేనేజర్ జి విజరు కుమార్, నందకుమార్, సృజన్ ఎంజీయూ ప్రతినిధులు అల్వాల రవి, మిరియాల రమేష్, శ్రీదేవి , అంజిరెడ్డి, అనురాధ, ప్రవల్లిక, చిలుకూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
డ్రగ్స్, దుడుకు స్వభావాల అంశాలపై అవగాహన
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం సహాయ కౌన్సిలింగ్ సెంటర్ ద్వారా ఇంజనీరింగ్ విద్యార్థులకు డ్రగ్స్ మహమ్మారిని ఎదుర్కోవడం, యుక్త వయసులో సహజంగా దుడుకు స్వభావం, ఉద్రిక్తతలు, కోపాన్ని నిగ్రహించుకోవడం వంటి అంశాలపై సైకాలజీ ప్రొఫెసర్ సి బినా ఆధ్వర్యంలోని బృందం గురువారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ బీనా మాట్లాడుతూ విద్యార్థి దశలో ఇటువంటి అవ లక్షణాలను సమర్ధవంతంగా ఎదుర్కోవడం ద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునని తెలిపారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ కళాశాల విద్యార్థులకు వివిధ పరిశోధన అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు నందకుమార్, కుందన, సంధ్య, శ్రీదేవి, అరుణ ప్రియ, అధ్యాపకులు పాల్గొన్నారు.