Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -చండూర్
అరుకాలం కష్టపడి పండించిన ధాన్యానికి ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎఫ్ఎస్ సీఎస్ చైర్మెన్్, డీసీసీబీ డైరెక్టర్ కోడి సుష్మ వెంకన్న అన్నారు. గురువారం మండలం లోని కొండాపురం గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని నేరుగా తీసుకువచ్చి కొనుగోలు కేంద్రాలలో అమ్మడం ద్వారా గిట్టుబాటు ధరను పొందవచ్చన్నారు. దళారు చేతుల్లో మోసపోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో రైతు బందు సమితి జిల్లా సభ్యులు కోడి వెంకన్న ,డైరెక్టర్లు డోలె నర్సాజీ, అచ్చని శ్రీనివాస్, గిరి సత్తయ్య బ్యాంకు ఇంఛార్జ్ సీఈవో ఆమీర్ కమాల్ సిబ్బంది పాల్గొన్నారు.