Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే రవీంద్రకుమార్
నవతెలంగాణ -చింతపల్లి
రైతు వేదికలు కర్షక దేవాలయాలుగా బాసిల్లుతున్నాయని టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ కొనియాడారు. గురువారం చింతపల్లి మండలం మాదనపురం గ్రామంలో రూ.22లక్షలతో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....రైతు వేదికల నిర్మాణాల ద్వారా వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావొచ్చని ఆయన అన్నారు.రైతులను సంఘటితం చేయడంతో పాటు తాము పండించిన పంటకు తామే ధర నిర్ణయించుకునే అధికారం రైతులకు ఉండాలన్న సంకల్పంతో రైతు వేదికల నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే దిక్సూచిగా మారాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సంక్షేమం కోసం రైతు వేదికల నిర్మాణాలను చేపట్టిందన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు, రైతు బీమా పథకాలు ద్వారా స్వరాష్ట్రంలోని రైతులు కాలర్ ఎగురవేసుకొని దర్జాగా జీవిస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో చింతపల్లి జెడ్పీటీసీ కంకణాల ప్రవీణ వెంకట్ రెడ్డి,ఎంపీపీ కొండూరు భవాని,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గోపీడి కిష్టారెడ్డి,టీిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి,ఆ పార్టీ మండల అధ్యక్షుడు దొంతం చంద్రశేఖర్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు గున్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి,మండల రైతు బంధు అధ్యక్షులు ఉజ్జిని విద్యసాగర్ రావు,స్థానిక సర్పంచ్ ఉడుత అఖిల,సర్పంచుల ఫోరం ప్రధాన కార్యదర్శి వింజమూరి రవి,మాస భాస్కర్,ఉడుత అక్రమ్ యాదవ్,అండేకార్ అశోక్,కుంభం శ్రీశైలం గౌడ్,దండెకార్ ప్రసాద్,మోహాన్,నాదిరి రమేష్,బాదేపల్లి నీరంజన్,అరేకంటి మురళి,తదితరులు పాల్గొన్నారు.
గ్రామాలు సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కృషి
గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ తెలిపారు. గురువారం చింతపల్లి మండలం మాదనపురం గ్రామంలో చేపట్టిన సీసీ రొడ్ఫు పనులను,రూ.12.60లక్షలతో నిర్మించిన స్మశాన వాటికను,పల్లె ప్రకృతి వనాని ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామన్నారు.ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత పల్లెలన్నీ క్రమక్రమంగా ప్రగతి పథంలో పయనిస్తున్నాయని అన్నారు. .గ్రామాల్లో గుణాత్మక మార్పు కోసం సీఎం కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని అన్నారు.