Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరి
తిరుమలగిరి మండలానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ బైరబోయిన వెంకటేశ్వర్లు పై దాడి చేసిన గుండాలను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని మండలానికి చెందిన పలువురు జర్నలిస్టులు డిమాండ్ చేశారు. గురువారం స్థానికంగా వారు మాట్లాడుతూ పత్రికా దినోత్సవం రోజున పత్రిక విలేకరిపై దాడి చేయడం సిగ్గుచేటైన విషయమని అన్నారు. తిరుమలగిరి మండలంలో దళిత బంధు విషయంలో జరుగుతున్న అవకతవకలను వెలికి తీసినందుకే కావాలనే కొంతమంది గుండాలు బుధవారం సాయంత్రం ఒంటరిగా ఉన్న వెంకటేశ్వర్లు పై దాడి చేసి చంపుతామని బెదిరించడం సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునే విషయమన్నారు. పత్రికా విలువలు కాపాడవలసిన వారే పత్రికా విలేకరులపై దాడులు చేయడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. వెంకటేశ్వర్లు పై దాడి చేసిన గుండాలను శిక్షించని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ విషయమై తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు కందుకూరు లక్ష్మయ్య సుధీర్ రెడ్డి, కిరణ్, రమేష్,రాజు,సుంకరి సుధీర్,ఏబీఎన్ గంగాధర్, వర్రే గంగాధర్,బాకీ శీను, సుధాకర్, సందీప్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.