Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆత్మకూరుఎస్
ఈ నెల 20, 21న నేరేడుచర్లలో నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నాలుగో జిల్లా మహాసభల పోస్టర్ ను ఆత్మకూరు ఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంఈఓ ధార సింగ్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకర్ నాయక్ ఆవిష్కరించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదోన్నతులతో కూడిన బదిలీలు వెంటనే చేపట్టాలని, పెండింగ్ లో ఉన్న డిఏ బకాయిలు విడుదల చేయాలని, మోడల్ స్కూల్ కేజీబివి పాఠశాలల ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని ఉపాధ్యాయులకు హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పీ. కరుణాకర్ రెడ్డి. ప్రధాన కార్యదర్శి చిలక రమేష్ గంజి విజరు కుమార్, దుర్గా ప్రసాద్ రెడ్డి, ఎల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
తిరుమలగిరి: సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల లో ఈ నెల 20, 21న జరిగే టీిఎస్ టీఎస్ యూటీ ఫ్ జిల్లా విద్య నాలుగవ మహాసభల వాల్ పోస్టర్ను గురువారం స్థానిక తెలంగాణ చౌరస్తాలో మండల శాఖ అధ్యక్షులు చల్లగుండ్ల సోమయ్య ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సున్నపోజు సోమయ్య, మండల ప్రధాన కార్యదర్శి బి. ఎల్ ఎన్ చారి, ఉపాధ్యక్షులు వీరు నాయక్, కోశాధికారి బీ. మహేష్, ఆడిట్ కమిటీ కన్వీనర్ కే.వెంకటయ్య, కాంప్లెక్స్ కార్యదర్శులు ఆర్ శ్రీనివాస్. జి రవిబాబు, ఎం. సైదులు, డి. రామ్ రెడ్డి, పి.ఉపేందర్, ఎస్. హుస్సేన్, బి. నాగార్జున, జి. రాములు, నాగారం మండల శాఖ అధ్యక్షులు ఆర్. యాదయ్య, ప్రధాన కార్యదర్శి బొజ్జ నాగయ్య ,పి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.