Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ- భువనగిరిరూరల్
ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అందించే పరికరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టరు పమేలా సత్పతి తల్లిదండ్రులకు సూచించారు. గురువారంభువనగిరి పట్టణంలో వైఎస్ఆర్. గార్డెన్లో అలింకో ( అర్టిఫిషియల్ లింక్స్ మ్యానుఫాక్చరింగ్ కార్పొరేషన్), సమగ్ర శిక్ష తెలంగాణ వారి అధ్వర్యంలో బడీడు వయస్సు గల వికలాంగ విద్యార్థుల కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించారు. జిల్లాలో 17 మండలాల నుండి 360 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. శిబిరంలో విద్యార్థులకు అవసరమైన పరికరాల గుర్తింపు, నిర్దారణ చేశారు. శిబిరంలో అలింకో కార్పొరేషన్ నుండి ముగ్గురు వైద్యులు శ్వేత, రవికుమార్, అభినవ్, భువనగిరి ఏరియా ఆసుపత్రి నుండి డాక్టర్ శ్రీనివాస రావు పరీక్షలు నిర్వహించారు. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు వారి స్థాయిని బట్టి ఎటువంటి పరికరాలు ఇవ్వాలో నిర్ణయించి త్వరలో అందిస్తారు. వీటిలో హియరింగ్ ఎయిడ్స్, ట్రై సైకిల్స్, వీల్ చైర్స్, రోలెటర్స్, క్రచెస్, సిపి చైర్స్, కాలిపర్స్, బ్రెయిలీ కిట్స్, , ఆర్టీఫిషియల్ లింబ్స్ ఉంటాయి. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు వారి స్థాయిని బట్టి అందించే పరికరాలను సద్వినియోగపరచుకోవాలన్నారు. జిల్లాలో గల 20 భవిత కేంద్రాలలో పిల్లలకు చదువుతో పాటు ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, వారి పనులు వారు చేసుకునేలా శిక్షణ అందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు దీపక్ తివారీ, జిల్లా విద్యా శాఖ అధికారి నారాయణరెడ్డి, ఐఇ కో-ఆర్డినేటరు కె జోసెఫ్, మండల విద్యా శాఖ అధికారి లక్ష్మినారాయణ, పాల్గొన్నారు.