Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ -ఆలేరుటౌన్
రైతు నేస్తంగా, కల్లుగీతకార్మికునిగా గ్రామ ప్రజల శ్రేయోభిలాషిగా, పారుపల్లి గ్రామాభివృద్ధికి పాటుపడిన బూడిద సోమయ్య గౌడ్ సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆలేరు మాజీ శాసనసభ్యులు, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బూడిద బిక్షమయ్య గౌడ్ తండ్రి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు. గురువారం ఆత్మకూరు మండలం పారుపల్లి గ్రామంలోని ఆయన వ్యవసాయ క్షేత్రం వద్ద దశదినకర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, జెడ్పీచైర్మెన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, నకిరేకల్,తుంగతుర్తి శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య,గాదరి కిషోర్ కుమార్, అల్ట్రా చైర్మెన్ మోతే పిచ్చిరెడ్డిలతో కలిసి బూడిద సోమయ్య గౌడ్ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. బూడిద సోమయ్య మృతి పట్ల బిక్షమయ్య గౌడ్, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి ప్రకృతికి, సహజత్వానికి దగ్గరగా ఆయన జీవనం సాగించారని ప్రశంసించారు. అంతకుముందు బిక్షమయ్య గౌడ్ నివాసంలో బూడిద సోమయ్య గౌడ్ దశదిన కర్మ సందర్భంగా కుమారులు, కోడళ్ళు బూడిద బిక్షమయ్య గౌడ్,సువర్ణ, బూడిద రాములు గౌడ్,లక్ష్మి, కూతురు దంతూరి గోదాదేవి, మన వళ్లు బూడిద ప్రవీణ్ గౌడ్, బాసుపల్లి సాయి శ్రీమాన్,దంతూరి అరవింద్ కుమార్, దంతూరి సాయి తేజ, మరవరాన్లు బూడిద ప్రనిశ,బాసుపల్లి లక్ష్మీ ప్రసన్నవాని, బూడిద లావణ్య,బూడిద అఖిల, ముని మనవరాలు బూడిద ఆరాధ్య ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. వ్యవసాయ క్షేత్రం వద్ద బూడిద సోమయ్య గౌడ్ జ్ఞాపకార్ధంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పలు రకాల పూలతో అలంకరించారు. నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి, మాజీ పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ సభ్యులు రామ్‌రెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, కొప్పుల వేనారెడ్డి, గుడిపాటి నర్సయ్య, పంజాల వెంకన్న, కటకం సత్తయ్య గౌడ్, దాసోజు శ్రావణ్, చింతల వెంకటేశ్వర రెడ్డి, నవ తెలంగాణ రిపోర్టర్ యేలుగుల కుమారస్వామి,ఆలేరు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సుమలత,చామకూర గోపాల్, గిరిరాజు వెంకటయ్య, ఆలేరు మాజీ ఇంచార్జ్ సర్పంచి దాసి సంతోష్, పిఎసిఎస్ డైరెక్టర్ బిసా. కృష్ణంరాజు, బందెల సుభాష్, పత్తి వెంకటేష్, రాజు, సందీప్, అడ్వకేట్ ప్రసాద్, పారుపల్లి సర్పంచ్ లగ్గం రమేశ్గైడ్, గండెగోని రామ్చందర్గౌడ్, ఆలేరు, ఆత్మకూరు, యాదగిరిగుట్ట, మూట కొండూరు,బొమ్మలరామారం, గుండాల,రాజపేట మండలాలు గ్రామాల నుండి, మోత్కూరు, హైదరాబాద్, భువనగిరి ప్రాంతాలకు చెందిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజా ప్రతినిధులు, అభిమానులు పాల్గొన్నారు.