Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి
నవతెలంగాణ- కోదాడరూరల్
ఈనెల 27న తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభల సందర్భంగా నల్గొండలో జరిగే భారీ బహిరంగ సభకు రైతాంగం అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని సుందరయ్య భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 27 ,28 ,29 తేదీలలో రైతు సంఘం రాష్ట్ర మహాసభలు పోరాటాల పురిటి గడ్డ నల్గొండ జిల్లా కేంద్రంలో జరుగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఈనెల 27న జరిగే బహిరంగ సభకు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పదివేల మంది రైతాంగాన్ని తరలిస్తున్నామన్నారు. రైతాంగానికి పార్లమెంటులో కనీసం మద్దతు ధర చట్టం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగం పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని ఆరోపించారు. రైతాంగానికి కనీస మద్దతు ధర కల్పించడం లేదని విమర్శించారు. ఎమ్. ఎస్ స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలని కోరారు. అన్ని గ్రామాలలో ఐకెపి కేంద్రాలను ప్రారంభించి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఐకెపి కేంద్రాలలో గన్ని బ్యాగుల కొరత నివారించి, రైతులు తెచ్చిన ధాన్యాన్ని వెంటనే కాంటావేసి, ధాన్యాన్ని లిఫ్ట్ చేయాలని కోరారు. వరి, పత్తి పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 21న సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగే పార్టీ జిల్లా విస్తతస్థాయి సమావేశానికి పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, మండల, పట్టణ కార్యదర్శులు ,మండల కమిటీ సభ్యులు, శాఖ కార్యదర్శి లు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మట్టి పెళ్లి సైదులు ,బెల్లంకొండ వెంకటేశ్వర్లు, పట్టణ కార్యదర్శి మిట్టగడుపుల ముత్యాలు, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ, రైతు సంఘం జిల్లా నాయకులు ఏనుగుల వీరాంజనేయులు, బీరవెల్లి సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.
సంస్మరణ సభను విజయవంతం చేయాలి
నాగారం: తెలంగాణ పోరాట యోధుల సంస్మరణ సభను విజయవంతం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు గురువారం నాగారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 22న వర్ధమానుకోట గ్రామంలో జరిగే తెలంగాణ పోరాట యోధుల సంస్మరణ సభకు నిరుద్యోగులు ప్రజా సంఘాలు యువకులు రైతులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అనంతరం మాట్లాడుతూ ఆనాటి తెలంగాణ పోరాట ఉద్యమంలో పేద ప్రజల పక్షాన నిలబడిన ఉద్యమకారులను స్మరించుకుంటూ వారి గుర్తుగా సంస్మరణ సభను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ సంస్మరణ సభలో దేశంలో పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యవసర వస్తువుల ధరలకు వ్యతిరేకంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు ఈ సమావేశంలో ఆ పార్టీ నాయకులు కొలిశెట్టి యాదగిరిరావు కడియం కుమార్ దేవరకొండ యాదగిరి వంగాల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.