Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
పట్టణంలోని 44,45 వార్డులో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ పారిశుధ్య కార్మికులు 20 మందికి నూతన వస్త్రాలను పంపిణీచేసినట్టు టీఆర్ఎస్ జిల్లా నాయకులు, 45 వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని క్ర్రపాకర్ దంపతులు తెలిపారు. తమ 20వ పెండ్లిరోజు సందర్భంగా గురువారం స్థానిక విద్యానగర్ లోని తమ నివాసం వద్ద కార్మికులకు వస్త్రాలను పంపిణీ చేసిన అనంతరం వారు మాట్లాడారు. తమ వార్డులో చెత్త సేకరణతో పాటు పరిశుభ్రంగా వుంచడానికి నిరంతరం కృషి చేస్తున్న పారిశుధ్య కార్మికులకు తమ వంతు సహాయం చేయడం సంతోషంగా వుందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు కుక్కడపు సాలయ్య, భిక్షం, బచ్చలకూరి సైదులు, తెరటపల్లి సతీష్, కళ్యాణ్, సందీప్, వెంకటేష్, ఫణి, డోగుపర్తి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.